రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడితో సతీష్‌ వేగేశ్న సినిమా

Published : Aug 15, 2020, 01:38 PM IST
రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడితో సతీష్‌ వేగేశ్న సినిమా

సారాంశం

రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ శ్రీహరి తెరంగేట్రంతో ఆయనపై ఆశలు రేకెత్తాయి. గతేడాది `రాజ్‌దూత్‌`తో హీరోగా ఎంట్రి ఆకట్టుకున్నారు. కానీ సినిమా పరాజయం చెందింది. తాజాగా మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు. 

రియల్‌ స్టార్‌ శ్రీహరి టాలీవుడ్‌లో నటుడిగా ఎంతటి పేరును తెచ్చుకున్నారో తెలిసిందే. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలక్షణ నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. వ్యక్తిగతంగానూ అందరి మన్ననలు పొందారు. ఆయన అకాల మరణం.. టాలీవుడ్‌లో ఆయన లేని లోటు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. 

ఇక ఆయన తనయుడు మేఘామ్ష్ శ్రీహరి తెరంగేట్రంతో ఆయనపై ఆశలు రేకెత్తాయి. గతేడాది `రాజ్‌దూత్‌`తో హీరోగా ఎంట్రి ఆకట్టుకున్నారు. కానీ సినిమా పరాజయం చెందింది. తాజాగా మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు. `శతమానం భవతి` వంటి జాతీయ అవార్డు చిత్రాన్ని రూపొందించిన సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఇందులో దర్శకుడు సతీష్‌ వేగేశ్న తనయుడు సమీర్‌ వేగేశ్న కూడా మరో హీరోగా నటిస్తుండటం విశేషం. 

నేడు శ్రీహరి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కొత్త సినిమాను ప్రకటించారు. ఇక ఈ సినిమాని `రాజ్‌దూత్‌` చిత్రాన్ని నిర్మించిన ఎంఎల్‌వీ సత్యానారాయణ(సత్తిబాబు) తన లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ, ఇప్పటి వరకు వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. అన్ని కుదిరితే త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ చేస్తాం` అని తెలిపారు. 

నిర్మాత ఎంఎల్‌వీ సత్యానారాయణ స్పందిస్తూ, `సతీష్‌ తీసిన `శతమానం భవతి` చిత్రం నా మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం` అని అన్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Vijay Rashmika Wedding Card: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. పెళ్లి చిన్నగా, రిసెప్షన్‌కి రండి
Couple Friendly Box Office: `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు.. రెండో రోజు పెరిగిన వసూళ్లు