
విలక్షణ నటుడు మోహన్‌బాబు `సన్ ఆఫ్ ఇండియా` అంటున్నారు. చాలా రోజులు తెలుగుగా తెరపై కనిపించని ఆయన చాలా గ్యాప్‌తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. `సన్ ఆఫ్ ఇండియా` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
`బుర్రకథ`తో దర్శకుడిగా మారిన ప్రముఖ రైటర్ డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీస్ పతాకంపై మంచు ఫ్యామిలీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోహన్‌బాబు ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటుంది. టైటిల్ ఓ ఇంగ్లీష్ పత్రికని తలపిస్తుంది. మొత్తంగా పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇదిలా ఉంటే దాదాపు 560లకుపైగా సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా, కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న మోహన్‌బాబు ఓ సినిమా కమిట్ అయ్యాడంటే, అదో సవాల్ అనే చెప్పాలి. రత్నబాబు తెచ్చిన స్క్రిప్ట్ తనని బాగా ఆకట్టుకుందట. దీంతో ఈ సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారని, ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.
మరోవైపు రైటర్‌గా తెలుగులో పాపులర్ అయిన డైమండ్ రత్నబాబు `బుర్రకథ` పేరుతో ఓ సినిమాకి దర్శకత్వం వహించిన విఫలమయ్యాడు. మరి ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో మోహన్‌బాబు సినిమా చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోస్టర్ చూస్తుంటే దేశభక్తి ప్రధాన చిత్రమిదని అర్థమవుతుంది. ఈ కథ, కథనం, మోహన్‌బాబు పాత్ర గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఉంటాయని, మోహన్‌బాబు పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.