హీరోని కాదు, మానవత్వం ఉన్న మనిషినే.. సోనూ సూద్‌

By Aithagoni RajuFirst Published Aug 15, 2020, 11:55 AM IST
Highlights

నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్న ఈ సినీ విలన్ సోనూ సూద్‌‌.. తాజాగా 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరిచుకుని ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

`నన్ను అందరు రియల్‌ హీరోగా కొలుస్తున్నారు. కానీ నేను మానవత్వం ఉన్న మనిషిని మాత్రమే. తోటి మనిషిగానే సేవలందిస్తున్నా` అని అన్నారు సోనూ సూద్‌. ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలలో ఎక్కువగా మారుమోగుతున్న పేరు సోనూ సూద్‌. అనేక మంది సినీ కార్మికులను, వలస కార్మికులను ఆదుకున్న సోనూ సూద్‌, అందరిచేత రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. ఆయన సేవని పొందిని వాళ్ళు నిజంగానే చేతులెత్తి మొక్కుతున్నారు. 

నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్న ఈ సినీ విలన్ సోనూ సూద్‌‌.. తాజాగా 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరిచుకుని ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తనని దేశమంతా రియల్‌ హీరో అంటున్నారని, కానీ తాను మాత్రం కేవలం మానవత్వం ఉన్న మనిషినే అని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రేమ, ఆశీర్వాదాలతోనే తాను చేసే పనులు ఇంత గొప్పగా సాగుతున్నాయని తెలిపారు. 

ఇంకా ఆయన స్పందిస్తూ, తనని అభినందించడమే కాకుండా ఇతరులకు సాయం చేయాలని తన అభిమానులను కోరారు. తాను చేస్తున్న గొప్ప పనులకుగానూ తనపై కొందరు బయోపిక్‌ తీయాలని సంప్రదిస్తున్నారని, అందుకు చాలా సంతోషంగా ఉందని, కానీ వాటిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు. 

ప్రతి రోజూ తనకు సాయం కోసం కొన్ని వందల మెయిల్స్ వస్తున్నాయని, వేల మంది ట్వీట్‌ చేస్తున్నారని, వాళ్ళందరికి నేను సాయం చేయలేను. ప్రతి రోజూ కనీసం ముప్పై నుంచి నలభై సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని, తనకంటే ఎక్కువ సాయం చేసే సామర్థ్యం ఉన్న వారు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరారు. దేశభక్తికి నిజమైన అర్థం తోటి వారిని ఆపద సమయంలో ఆదుకోవడమే అని తెలిపారు. 

తెలుగులో `అరుంధతి` సినిమాలో పశుపతిగా పాపులర్‌ అయిన సోనూసూద్‌ ప్రస్తుతం తెలుగులో `అల్లుడు అదుర్స్`, హిందీలో `పృథ్వీరాజ్‌`, తమిళంలో `తమిళరాసన్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

click me!