గోదావరి బ్యాక్‌ డ్రాప్‌ లవ్‌ స్టోరీతో `శశివదనే`.. టీజర్ అదిరింది..

Published : Jan 03, 2024, 11:47 PM IST
గోదావరి బ్యాక్‌ డ్రాప్‌ లవ్‌ స్టోరీతో `శశివదనే`.. టీజర్ అదిరింది..

సారాంశం

`పలాస` ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన `శశివదనే` మూవీ టీజర్‌ని విడుదల చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా  ఉంది. టీజర్ క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది.

`పలాస 1978`తో పాపులర్ అయ్యాడు రక్షిత్ అట్లూరి. గ్రామీణ నేపథ్య కథతో, కులవివక్ష, ధనిక పేద అనే తారతమ్యాలను చర్చించే కథాంశంతో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. దీనితో రక్షిత్‌ పాపులర్‌ అయ్యాడు. ఆతర్వాత ఆయన చేసిన సినిమా డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు మరో స్వచ్ఛమైన లవ్‌ స్టోరీతో వస్తున్నాడు. గోదావరి నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీతో సినిమా చేశాడు. ఇందులో అదిరిపోయే యాక్షన్‌ డ్రామా ఉండటం విశేషం. ఆయన సరసన కోమలి ప్రసాద్‌ హీరోయిన్‌గా చేసింది. సాయి మోహన్‌ ఉబ్బర దర్శకత్వం వహించిన ఈ చిత్రం గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ,  ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మాణంలో తెరకెక్కుతుంది. 

తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు. టీజర్‌ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. ఇందులో హీరో రక్షిత్ అట్లూరి, హీరోయిన్ కోమలీ కోసం ఆమె ఇంటి దగ్గర వెయిట్ చేయటం, ఆమె కనపడకపోవటంతో ఆమెకు డిఫరెంట్‌గా సిగ్నల్ పంపటం చాలా పోయెటిక్‌గా ఉన్నాయి. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇక టీజర్ ఎండింగ్‌లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. చూడబోతుంటే సాడ్‌ ఎండింగ్‌లా ఉంది. సినిమా ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 

సినిమాలో మాత్రం ట్విస్ట్ లు, టర్న్‌ లు, ఊహించిన హై మూమెంట్స్ ఉంటాయని చెబుతుంది యూనిట్. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్  అంచనాలను మరింత పెంచుతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న `శశివదనే` చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు. శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?