హోటల్‌లో అమ్మాయితో హీరో అజిత్‌ చిందులు.. విజయ్‌కాంత్‌ మృతికి ముడిపెడుతూ దారుణంగా ట్రోల్స్..

Published : Jan 03, 2024, 09:54 PM ISTUpdated : Jan 03, 2024, 10:17 PM IST
హోటల్‌లో అమ్మాయితో హీరో అజిత్‌ చిందులు.. విజయ్‌కాంత్‌ మృతికి ముడిపెడుతూ దారుణంగా ట్రోల్స్..

సారాంశం

అజిత్‌ కొత్త ఏడాది సెలబ్రేషన్స్ దుబాయ్‌లో చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన దుబాయ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్‌ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ట్రోలర్స్ బారిన పడ్డారు.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ ట్రోలర్స్ బారిన పడ్డారు. ఆయన న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ని ఇప్పుడు నెటిజన్లు తప్పుపడుతున్నారు. దారుణంగా ఆడుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అజిత్‌కి సంబంధించిన ఓ వీడియోని వైరల్‌ చేస్తూ నానా యాగి చేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. మరి అజిత్‌ వివాదానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు అనేది చూస్తే.. 

అజిత్‌ కొత్త ఏడాది సెలబ్రేషన్స్ దుబాయ్‌లో చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన దుబాయ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్‌ చేసుకున్నారు. అక్కడ బాగా ఎంజాయ్‌ చేశారు. హోటల్‌లో సరదాగా గడిపారు. ఈ క్రమంలో హోటల్‌ సిబ్బందితో కలిసి అజిత్ డాన్సు చేశాడు. అందరిని ఎంటర్‌టైన్ చేశాడు. తను ఛిల్‌ అయ్యాడు. ఆ వీడియో క్లిప్‌ ఒకటి ఇప్పుడు ట్విట్టర్‌(ఎక్స్)లో వైరల్‌ అవుతుంది. మరోవైపు ఓ షిప్‌లో ఆయన ఎంజాయ్‌ చేశాడు. అదే సమయంలో ఫ్యాన్స్ తో కలిసి సరదాగా గడిపారు. వారితో ముచ్చటించాడు. 

ఈ సందర్భంగా ఆయన్ని కొందరు వీడియోలు తీశారు. వద్దు అంటూ వారికి తెలిపారు అజిత్‌. ఓ వ్యక్తి వీడియో తీయగా ఫోన్‌ తీసుకుని ఆ వీడియోని డిలీట్‌ చేశాడు. ఈ వీడియో క్లిప్‌ కూడా నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే వీటిని పట్టుకుని యాంటి ఫ్యాన్స్, ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. కొత్త ఏడాది ఆయన ఎంజాయ్‌ చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇటీవల సీనియర్‌ హీరో విజయ్‌ కాంత్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు అజిత్‌ రాలేదు. 

మరోవైపు తమిళనాడులో వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులు చెన్నై సీటీని అతలాకుతలం చేశాయి. దానిపై కూడా అజిత్‌ స్పందించలేదు. ఎలాంటి సహాయం చేయలేదు. వీటిని ట్యాగ్‌ చేస్తూ ఆడుకుంటున్నారు ట్రోల్స్. విజయ్ కాంత్‌ ని చూడ్డానికి రాలేదు, చెన్నై వరదలు వస్తే కనీసం సహాయం ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఎంజాయ్ మెంట్‌ కావాల్సి వచ్చిందా అంటూ ప్రశ్నిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. యాంటీ ట్యాగ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో నెట్టింట అజిత్‌ హాట్‌ టాపిక్ అయ్యాడు. మరి దీన్ని ఆయన ఎలా తీసుకుంటారో చూడాలి. 

ఈ ఏడాది `తునివు` చిత్రంతో వచ్చాడు అజిత్‌. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు మాజిగ్‌ తిరుమేని దర్శకత్వంలో `విదా ముయార్చి` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో త్రిష హీరోయిన్. అర్జున్‌ సర్జా, రెజీనా, అరవ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజిత్‌ నెక్ట్స్ .. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?