`బిగ్‌ బాస్‌` విన్నర్‌ అభిజీత్‌ రీఎంట్రీ.. లావణ్యతో కలిసి వెబ్‌ సిరీస్.. ఫుల్‌ డిటెయిల్స్

Published : Jan 03, 2024, 11:23 PM IST
`బిగ్‌ బాస్‌` విన్నర్‌ అభిజీత్‌ రీఎంట్రీ.. లావణ్యతో కలిసి వెబ్‌ సిరీస్.. ఫుల్‌ డిటెయిల్స్

సారాంశం

బిగ్‌ బాస్‌ 4 విన్నర్ అభిజీత్‌ రీఎంట్రీ ఇస్తూ ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇటీవల పెళ్లిచేసుకున్న లావణ్య త్రిపాఠి ఇందులో ఫీమేల్‌ లీడ్‌ చేయడం విశేషం. 

`బిగ్‌ బాస్‌ 4` విన్నర్‌ అభిజీత్‌.. ఈ రియాలిటీ షో అయిపోయాక.. కనుమరుగు అయ్యాడు. ఆయన సినిమాలను పూర్తిగా వదిలేశాడు. ఫారెన్‌లో సెటిల్‌ అయ్యాడు. ఇక సినిమాలు చేయడని అంతా ఫిక్స్ అయ్యారు. ఆయన కూడా మళ్లీ కనిపించకపోవడంతో అదే అనుకున్నారు. కానీ సడెన్‌గా తెరపైకి వచ్చాడు. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. నటుడిగా మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌ చేశాడు. ఇటీవలే వరుణ్‌ తేజ్‌ని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయిన లావణ్య త్రిపాఠితో కలిసి నటిస్తున్నాడు. 

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో `మిస్‌ పర్‌ఫెక్ట్ `అనే వెబ్‌ సిరీస్‌ రూపొందింది. ఇది విడుదలకు రెడీ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ కోసం ఈ వెబ్‌ సిరీస్‌ చేశాడు. అభిజ్ఞ ఉతలూరు మరో కీలకపాత్ర పోషిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కి విశ్వక్‌ ఖండేరావ్‌ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠీ స్పందిస్తూ, `న్యూ ఇయర్ ను పర్ఫెక్ట్ గా మొదలుపెట్టబోతున్నాం...' అంటూ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ - "మిస్ పర్ఫెక్ట్" లాంటి ఒక యూనిక్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన జీవితాల్లో అనుకోకుండా ఏర్పర్చుకునే కొన్ని కనెక్షన్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయి అనే కథతో ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీగా "మిస్ పర్ఫెక్ట్" ను రూపొందించాం. అన్ని వర్గాల ఆడియెన్స్ ఈ సిరీస్ తో కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను` అని అన్నారు.

ఇందులో అభిజిత్‌ లుక్‌ కొత్తగా ఉంది. కాస్త బొద్దుగా కనిపిస్తున్నాడు. ఇక పెళ్లైన తర్వాత లావణ్య త్రిపాటి నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ ఇది. దీంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ట్రెండీ కంటెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉంటుందో చూడాలి. 

నటీనటులు - లావణ్య త్రిపాఠి, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు, ఝాన్సీ, హర్షవర్థన్, మహేశ్ విట్ట, హర్ష్ రోషన్ తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ - రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ - ఆదిత్య జవ్వాది
మ్యూజిక్ - ప్రశాంత్ ఆర్ విహారి
రైటర్స్ - ఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - ఆధిప్ అయ్యర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఆనంద్ కర్నాటి
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్ - అన్నపూర్ణ స్టూడిస్
నిర్మాత - సుప్రియ యార్లగడ్డ
డైరెక్టర్ - విశ్వక్ ఖండేరావ్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?