
‘సర్కారు వారి పాట’(SVP) కోసం అటు ఫ్యాన్స్, ఇటు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉండటంతో ఫ్యాన్స్ కొంత అసంత్రుప్తిలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇది గమనించిన మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu)కుఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబుకు ప్రత్యేకంగా యూత్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మూవీ విడుదలైతే చాలు రికార్డులు బద్దలు కావాల్సిందే. అలాంటి మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన సర్కారు వారి పాట పోస్ట్ ఫోన్ అయ్యింది. ఏకంగా మే 12కి వాయిదా పడింది. అయితే సర్కారు వారి పాట నుండి వస్తున్న అప్డేట్స్ మాత్రం కిక్ ఇస్తున్నాయి.
తాజాగా సర్కారు వారి పాట నుంచి మరో క్రేజీ అప్డేట్ అందింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'కళావతి' ఓ రేంజ్ లో పాప్యులర్ అయ్యింది. వంద మిలియన్ వ్యూస్ కి దగ్గరవుతున్న ఈ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కళావతి సాంగ్ మేనియా కొనసాగుతుండగానే సెకండ్ సింగిల్ రెడీ చేస్తున్నారు. సర్కారు వారి పాట మూవీ నుండి సెకండ్ సింగిల్ ‘పెన్నీ’(Penny) సాంగ్ ను మార్చి 20న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ వారు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ప్రతి పైసా విలువైన పాట’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
అయితే, ఈ సాంగ్ కూడా సాంగ్స్ లవర్స్ కు తెగ నచ్చుతుందంటూ మేయర్స్ ధీమా వ్యక్తం చేశారు. మరో మూడు రోజుల్లో సెకండ్ సింగిల్ పెన్నీ (SVP Second Single) ప్లే లిస్ట్ లో చేరిపోతుందని తెలిపారు. సెకండ్ సింగిల్ ను కూడా హిట్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఈ సారి 24 గంటల్లో 30 మిలియన్ల వ్యూస్ దక్కాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేశ్ బాబు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. సన్ గ్లాసెస్, జీన్ షర్ట్, జీన్స్ ధరించిన మహేశ్ బాబు స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దర్శకుడు పరశురామ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చివరిగా వచ్చిన ‘కళావతి’ (Kalaavathi), తమిళ నటుడు విజయ్ థళపతి మూవీ ‘బీస్ట్’ నుంచి రిలీజ్ అయిన ‘అరబిక్ కుత్తు’తో పోటీపడింది. ఈ సారి కూడా ఒక్కరోజు గ్యాప్ తేడాతో మార్చి 19న విజయ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్స్ రిలీజ్ కానుంది. ఆ మరుసటి రోజే సర్కారు వారి పాట నుంచి వస్తున్న పెన్నీ ఎంతలా ట్రెండ్ అవుతాయోనని ఆసక్తి నెలకొంది.