ఈ వారం ఆహాలో ‘మేజర్’ స్టార్ కాస్ట్ తో అలరించబోతున్న 'సర్కార్ 2 ', 'తెలుగు ఇండియన్ ఐడల్'

Published : May 25, 2022, 01:55 PM ISTUpdated : May 25, 2022, 02:05 PM IST
ఈ వారం ఆహాలో ‘మేజర్’ స్టార్ కాస్ట్ తో అలరించబోతున్న 'సర్కార్ 2 ', 'తెలుగు ఇండియన్ ఐడల్'

సారాంశం

తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` అన్ లిమిటెడ్ కంటెంట్ తో దూసుకెళ్తోంది. తాజాగా ‘మేజర్’మూవీ హీరోహీరోయిన్ అడివి శేషు, శోభితాతో ‘సర్కారు 2’, ‘తెలుగు ఇండియన్ ఐడల్’ రియాలిటీ షో ద్వారా ఈ వారం ఆడియెన్స్ ను అలరించనుంది. 

తెలుగు ఓటీటీ డిజిటల్‌ సంస్థ `ఆహా` (Aha) విజయవంతంగా రన్‌ అవుతుంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోస్‌ నిర్మిస్తూ దూసుకుపోతుంది. అందులో భాగంగా టాక్‌ షోలు బాగా పాపులర్‌ అయ్యాయి. సమంత హోస్ట్ గా చేసిన `సామ్‌జామ్‌`, బాలకృష్ణ హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షోలు విశేష ఆదరణ పొందాయి. ప్రస్తుతం రియాలిటీ షోలు ‘తెలుగు ఇండియన్ ఐడల్’తో  పాటు యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా ‘సర్కారు 2’  కొనసాగుతున్నాయి. ఈ వారం ‘మేజర్’ మూవీ స్టార్ కాస్ట్ తో రియాలిటీ షోలు అలరించనున్నాయి. 

ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రారంభమైన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. 32 ఏపిసోడ్స్ గా రన్ అవుతున్న ఈ షో చివరి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ‘రేస్ టు ఫినాలీ’ కోసం తమ ప్రతిభను బయటికి తీస్తున్నారు. అయితే ఈ వారం ఎపిసోడ్ లో ఎప్పుడూ చూడని విధంగా సందడిని తెచ్చింది ఆహా.  'మేజర్' టీమ్‌ అడివి శేష్, శోభిత ధూళిపాళలను  స్పెషల్ గెస్ట్ లుగా ఆహ్వానించడంతో లేటెస్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమో కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ షోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, అందాల హీరోయిన్ నిత్యామీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మే 27న ఫుల్ ఎపిసోడ్ రానుంది. 

అదేవిధంగా Major టీం ‘ఆహా’లోనే సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ‘సర్కార్ 2’ గేమ్ షోలోనూ సందడి చేశారు. లేటెస్ట్ గా ఈ వారానికి సంబంధించి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. అడివి శేష్, హీరోయిన్ శోభితా ధూళిపాళ  షోలో ఫుల్ జోష్ కనబరిచారు. ఇందుకు సంబంధించిన ప్రొమో దూసుకెళ్తోంది. కాగా ఈషోను ఏప్రిల్ 29న ప్రారంభించారు. `ఆహా`లో `స‌ర్కార్` గేమ్ షో సీజ‌న్ 1కి వ‌చ్చిన రెస్పాన్స్ కి, మరింత జిగేల్‌మ‌నిపించే సీజన్ 2 రన్ అవుతోంది. అగ‌స్త్య ఆర్ట్స్ నిర్మించిన గేమ్ షో ఇది. ప్ర‌దీప్ మాచిరాజు షోని హోస్ట్ చేస్తున్నారు.  మే 27న  ఈషోకు సంబంధించిన ఐదో ఎపిసోడ్ రిలీజ్ కానుంది.  

అడవి శేష్‌ (Adivi Sesh) హీరోగా నటించిన చిత్రం `మేజర్‌` (Major). శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రమిది. సాయీ మజ్రేఖర్‌, శోభితా దూళిపాళ్ల  హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటనలో పోరాడిన ఇండియన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ ప్రీమియర్ తో హిట్ టాక్ వచ్చింది.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు