Upasana New Car: లగ్జరీ కారు కొన్న ఉపాసన .. తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించిన మెగా కోడలు

Published : May 25, 2022, 11:25 AM IST
Upasana New Car: లగ్జరీ కారు కొన్న ఉపాసన .. తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించిన మెగా కోడలు

సారాంశం

మెగా కోడలు, అపోలో చైర్ పర్సన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన  కొత్త కారు కొనేశారు. ఈ లగ్జరీ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తూ తన ఇన్స్‌‌స్టా పేజ్‌లో ఉపాసన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. వీడియో  సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌ అయ్యింది. ఇంతకీ ఉపాసన ఏ కారు కొనింది.  

సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తుంటుంది  మెగా కోడలు ఉపాసన. ఎప్పటికప్పుడు తనకు, మెగా ఫ్యామిలీకి  సంబంధించిన,  విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. అంతే కాదు తన భర్త రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలు, తన ఇష్టాఇష్టాలు కూడా ఫ్యాన్స్ కు శేర్ చేస్తుంటుంది ఉపాసన. ఇక తాజాగా ఆమె తన  లగ్జరీ కారును అందరికి పరిచయం చేసింది. కారు విశేషాలు అందరితో పంచుకుంది. 

రామ్ చరణ్ వైఫ్ రీసెంట్ గా కొత్త కారు కొన్నది. ఆడి ఈ ట్రాన్ అనే కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన ఉపాసన కారు ఫీచర్స్ ను గురించి వివరంగా చెప్పారు. ఈ కారు ఎంతో సురక్షితమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. తన దృష్టిలో భవిష్యత్తు అంటే సుస్థిరతతో పాటు  లగ్జరీ కూడా కలిసి ఉంటుందని ఉపాసన అన్నారు. అంతే కాదు ఆడి ఇ-ట్రాన్‌ కారులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభం అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆడి కారు రేటు ఎంత ఉంటుందో తెలుసా.. కళ్లు చెదిరే ఫీచర్స్ ఉన్న ఈ కారు ధర మాత్రం కోటి ఇరవై లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన తీసుకున్న కారు చాలా బాగుందని, కలర్ అయితే ఇంరా సూపర్ అంటూ..సోషల్ మీడియాలో నెటిజన్లు ఉపాసనను విష్ చేస్తున్నారు.  ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇక అపోలో చైర్మెన్ గా ఉన్న ఉపాసన.. మెగా కోడలిగా కొణిదెల వారింట అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ఉపాసన సోషల్ సర్వీస్ తో పాటు.. మూగజీవాల పరిరక్షణలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతే కాదు ఏదైనా ముఖం మీదై సూటిగా చెప్పే మెగా కోడలు.. సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా మాట్లాడిన నెటిజ్లకు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఫ్యాషన్ ఈవెంట్స్ కు వెళ్తూ.. ఆడవారిలో చైతన్య కలిగించే కార్యకరమాలు కూడా చేస్తున్నారు ఉపాసన.  అలాగే బీ పాజిటివ్ అనే మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. సోషల్ మీడియా వేదికగా పలు ఆరోగ్య సంబంధిత సూచనలు ఇస్తుంటారు.

ఇక రామ్ చరణ్ తో టూర్స్ ప్లాన్ చేసుకుంటూ.. ఆ విశేషాలు కూడా సోషల్ మీడియాలో శేర్ చేస్తుంటారు మెగా కోడలు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకున్న ఈసినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో మూవీ ప్లాన్ చేసుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు