MI7 : ట్రైలర్ లో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ నోరెళ్లబెట్టాల్సిందే.. ‘డెడ్ రెకనింగ్’

Surya Prakash   | Asianet News
Published : May 25, 2022, 11:50 AM IST
MI7 : ట్రైలర్ లో ఆ యాక్షన్ ఎపిసోడ్స్ నోరెళ్లబెట్టాల్సిందే.. ‘డెడ్ రెకనింగ్’

సారాంశం

భారీ యాక్షన్ విన్యాసాలు.. గగుర్పొడిచే సాహసాలతో అద్భుతం అనిపించే వీఎఫ్ ఎక్స్ టెక్నాలజీతో నెవ్వర్ బిఫోర్ అనిపించే లొకేషన్లలో MI7 సినిమా  తెరకెక్కి రిలీజ్ కు రెడీ అయ్యింది..ట్రైలర్ విడుదలైంది.


హాలీవుడ్‌ మూవీ సిరీస్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ (ఎమ్‌ఐ)కి ఉన్న క్రేజ్‌ గురించి తెలిసిందే. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ సినిమాల్లోని హీరో తన అసిస్టెంట్స్‌తో కలిసి చేసే అడ్వెంచర్స్  అబ్బురపరిచేలా ఉంటాయి. అందుకే సిరీస్‌లోని మరో సినిమా రిలీజ్‌ అవుతుందంటేనే ఎప్పుడెప్పుడా అభిమానులు ఎదురుచూస్తుంటారు.  ఈ క్రమంలో ఈ సీరిస్ నుంచి మరో చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది.

హాలీవుడ్‌ స్టార్‌ నటుడు టామ్‌క్రూజ్‌ హీరోగా నటిస్తున్నా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌లో ఆరు సినిమాలు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సిరీస్‌లో వస్తున్నా తాజా చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహిస్తున్నాడు. క‌రోనా వ‌ల్ల ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వచ్చిన.. ఏడో పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ లో ఏడవ భాగం ‘డెడ్ రెకనింగ్’  (Dead Reckoning) పార్ట్ వన్ ట్రైలర్ విడుదలైంది. వచ్చే ఏడాది జూలైలో ప్రపంచ ప్రేక్షకుల్ని అబ్బుర పరచబోతోంది ఈ సినిమా.
  
ఎప్పటిలాగే టామ్ క్రూజ్ (Tom cruise), సైమన్ పెగ్ (siman peg), రెబెక్కా ఫెర్గూసన్ (Rebecca Ferguisen) లాంటి సీక్రెట్ ఏజెంట్స్ .. తమదేశానికి ముప్పు వాటిల్లటంతో అసాధ్యం అనుకున్న మిషన్‌ను చేపట్టి.. తమ సాహసాలతో సుసాధ్యం అయ్యేలా చేస్తారు. ఈ ట్రైలర్ లోనూ గత చిత్రాల్లో మాదిరిగానే..  టామ్ క్రూజ్ చేసే డెడ్లీ ఛేజింగ్స్, స్టంట్స్ అబ్బుర పరుస్తున్నాయి. MI7 పార్ట్ వన్ లోని.. ఈ మొదటి ట్రైలర్ కళ్ళుచెదిరే విజువల్స్‌తో థ్రిల్ చేస్తోంది. రైలు పట్టాలనుంచి డీప్ ఎండ్ లోకి వెళుతున్నట్టు చూపించడం.. టామ్ మోటార్ బైక్ నడుపుతూ కొండపై నుంచి దూకడం నెవర్ బిఫోర్ అనిపిస్తుంది. కేవలం యాక్షన్ అండ్ స్టంట్స్‌తో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. 

‘డెడ్ రికనింగ్’ (Dead Reckoning) పార్ట్ 1,  2023 జూలై 14న థియేటర్స్ లో విడుదల కానుండగా.. పార్ట్ 2.. 2024 జూన్ 28న విడుదల కానుండడం విశేషం. క్రిస్టఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టామ్‌క్రూజ్ (Tom cruise) కెరీర్ లో మరో మెమరబుల్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఫ్రాంచైస్‌లో ఇప్పుడు ఏడు, ఎనిమిది భాగాలు కూడా  ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. సీక్రెట్ ఏజెంట్ ఈథన్ హంట్ ‌(Ethen Hunt) గా టామ్‌క్రూజ్ తన అసాధారణమైన టాలెంట్‌తో సాహసోపేతమైన స్టంట్స్‌తో ప్రపంచ సినీ ప్రేమికుల్ని అలరిస్తూ వస్తున్నాడు.  
 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు