సెప్టెంబర్ 15న వస్తున్న‘ సరసుడు’

Published : Sep 09, 2017, 03:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
సెప్టెంబర్ 15న వస్తున్న‘ సరసుడు’

సారాంశం

‘సరసుడు’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు శింబు శింబు సరసన నయనతార, ఆండ్రియా, అదాశర్మ సెప్టెంబర్ 15న  రిలీజ్ కానున్న సరసుడు

యంగ్ ఛార్మింగ్ హీరో శింబు, అందాల తారలు నయనతార, ఆండ్రియా, అదాశర్మలు జంటగా నటించిన చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రాన్ని తెలుగులో సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తమిళంలో ‘ ఇదునమ్మ ఆళు’ పేరుతో విడుదల చేయగా భారీ విజయం సాధించింది. విడులైన కొద్ది రోజుల్లోనే రూ.27కోట్లు కలెక్ట్ చేసింది శింబు కెరీర్లోనే నెంబర్ వన్ హిట్ గా నిలిచింది.

 

ఇప్పుడు ఈ చిత్రాన్ని సరసుడు పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. టి.రాజేందర్ సమర్పిస్తున్నారు. శింబు సినీ ఆర్ట్స్ అండ్ జేసనరాజ్ ఫిలింస్ బేనర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. నయనతార, శింబులు ఒకప్పుడు ప్రేమించుకొని తర్వాత విడిపోయారు. చాలా కాలం తర్వాత  వీరిద్దరూ కలిసి నటించిన చిత్రమిది. శింబు, నయనతారల మధ్య రోమాంటిక్ సీన్సు బాగా పండాయని చిత్ర బృందం చెబుతోంది.

 

ఈ  సినిమా గురించి శింబు మాట్లాడుతూ.. ‘మన్మథ, వల్లభ చిత్రాలు తెలుగులో విడుదలై సూపర్ హిటయ్యాయి. ఇప్పుడు సరసుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ చిత్రం తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో కూడా అంతే విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నానన్నారు. అద్భుతమైన లవ్ స్టోరీ ఇది.. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు.

 

నిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ.. ‘శింబు సినీ ఆర్ట్స్ బ్యానర్ లో ‘కుర్రాడొచ్చాడు’ చిత్రంతో శింబుని హీరోగా లాంచ్ చేశాం. మళ్లీ అదే బ్యానర్ లో సరసుడు చిత్రాన్ని తెలుగులో నిర్మించాం. తమిళంలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు మంచి రోజు చూసుకొని సెప్టెంబర్ 15న తెలుగులో విడుదల చేస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేవిధంగా వుంటుంది. ఈ చిత్రానికి మాటలు, పాటలు నేనే రాశాను. మా చిన్నబ్బాయి కురళ్‌ అరసన్‌ మ్యూజిక్‌ చేశాడు. నన్ను, శింబుని ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి కురళ్‌ అరసన్‌ని సంగీత దర్శకుడిగా ఆదరించాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.

 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు