స్పైడర్ టీమ్ కు హ్యాండిచ్చిన రోబో శంకర్

Published : Sep 09, 2017, 02:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
స్పైడర్ టీమ్ కు హ్యాండిచ్చిన రోబో శంకర్

సారాంశం

ఈ సాయంత్రం ఘనంగా చెన్నైలో స్పైడర్ ఆడియో విడుదల కార్యక్రమానికి రజనీకాంత్, శంకర్ లను ఆహ్వానించిన స్పైడర్ టీమ్ చివరి నిమిషంలో ఆడియో వేడుకకు రాలేనని రద్దు చేసుకున్న శంకర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. స్పైడ‌ర్ ఆడియో రిలీజ్ చెన్నైలో జ‌ర‌గ‌బోతోంది. తెలుగు, త‌మిళ పాట‌ల్ని అక్క‌డే విడుద‌ల చేయ‌నన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంక‌ర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది చిత్ర‌బృందం. శంక‌ర్ కూడా వ‌స్తాన‌ని మాటిచ్చాడు. కాక‌పోతే చివ‌రి నిమిషాల్లో శంక‌ర్ డ్రాప్ అయిన‌ట్టు స‌మాచారం. రోబో 2 ప‌నుల్లో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న శంక‌ర్‌.. స్పైడ‌ర్ ఆడియోకి రాలేన‌ని చెప్పాడ‌ట‌. దాంతో.. స్పైడ‌ర టీమ్ సడెన్ గా నిరుత్సాహంలో కూరుకుపోయింది. రాజమౌళి కూడా ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి హాజ‌ర‌వుతాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అది కూడా కన్ ఫ్యూజన్లో పడిందని తెలుస్తోంది.

 

దీంతో ఇప్పుడు గెస్టులెవ‌రూ లేకుండానే చిత్ర‌బృందం సమమక్షంలో ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంద‌ట‌. ఆడియో విడుద‌ల రోజునే థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డం ఆన‌వాయితీగా మారింది. అయితే.. స్పైడ‌ర్ థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్‌ని ఈ రోజు విడుద‌ల చేయ‌డం లేద‌ని స‌మాచారం. రెండ్రోజుల త‌ర‌వాత‌.. ట్రైల‌ర్‌ని వ‌దులుతార‌ట‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి హారీశ్ జ‌య‌రాజ్ సంగీతం అందించాడు. ఈ ద‌స‌రా కానుక‌గా ఈనెల 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర‌బృందం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే