సారా అలీ ఖాన్‌ ముక్కు పగిలింది.. కొట్టిందెవరు?

Published : Aug 04, 2021, 10:20 AM IST
సారా అలీ ఖాన్‌ ముక్కు పగిలింది.. కొట్టిందెవరు?

సారాంశం

బాలీవుడ్‌ హీరోయిన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ తనయ సారా అలీ ఖాన్ ముక్కుకి గాయమైంది. రక్తం మరకలతో నిండిపోయింది. ఈ విషయాన్ని వాళ్ల అమ్మానాన్నతో మొరపెట్టుకుంది సారా.

బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌ గాయాలపాలైంది. ఆమె ముక్కుకి బలమైన గాయమైంది. రక్తం కారుతున్న స్థితిలో ఆమె బ్యాండేజ్‌ వేసుకుని తన ఆవేదన పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో  ఈవిషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోని పంచుకుంది సారా అలీ ఖాన్‌. ఇందులో బ్యాండేజ్‌ వేసుకుని తనని ముక్కుపై కొట్టారు.. కొట్టారంటూ వాళ్ల అమ్మా నాన్న సైఫ్‌ అలీ ఖాన్‌, అమృతా సింగ్‌లకు తెలిపింది. 

నాకౌట్‌ అని వర్ణిస్తూ ముక్కుకి ఉన్న ప్యాచ్‌ని తొలగించింది. ముక్కుకి రక్తం మరకలున్నాయి. ఈ సందర్భంగా సారా కామెడీ చేసేప్రయత్నం చేసింది. `నాక్‌(కొట్టడం), నాక్‌ అక్కడ ఎవరున్నారు? నాక్‌ చేయండి.  నాకౌట్‌ చేయండి` అంటూ వెల్లడించింది సారా. ఈ సందర్భంగా తన గాయంపై అమ్మానాన్నలకు ఫిర్యాదు చేస్తూ సారీ చెప్పింది సారా. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. త్వరగా కోలుకోవాలని పలువురు సినీ సెలబ్రిటీలు కామెంట్లు పెడుతున్నారు. 

అయితే సారాకి నిజంగానే దెబ్బతగిలిందా? నిజమే అయితే కొట్టిందెవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదంటే ఏదైన ప్రమోషన్‌లో భాగంగానా? కామెడీ చేయడంకోసం ఇలా చేసిందా? అన్నది ఆసక్తికరంగా మారింది. `కేదార్‌నాథ్‌`, `సింబా`, `లవ్‌ ఆజ్‌ కల్‌`, `కూలీ నెం1` చిత్రాలతో ఆకట్టుకున్న సారా ప్రస్తుతం `అట్రాంగి రే` చిత్రంలో ధనుష్‌తో కలిసి నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?