సింగర్‌ యో యో హనీసింగ్‌పై భార్య గృహ హింస, లైంగిక వేధింపుల కేసు

Published : Aug 04, 2021, 08:23 AM IST
సింగర్‌ యో యో హనీసింగ్‌పై భార్య గృహ హింస, లైంగిక వేధింపుల కేసు

సారాంశం

ప్రముఖ పాపులర్‌ బాలీవుడ్‌ సింగర్‌ యో యో హనీ సింగ్‌పై ఆయన భార్య కేసు పెట్టింది. లైంగిక వేధింపులు, గృహ హింస ఆరోపణలో ఆమె ఢిల్లీలోని తిస్‌ హజారీ కోర్ట్ ని ఆశ్రయించింది.

ప్రముఖ పాపులర్‌ బాలీవుడ్‌ సింగర్‌, నటుడు యోయో హనీ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హనీసింగ్‌పై ఆయన భార్య షాలిని తల్వార్‌ గృహ హింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు పెట్టింది. ఢిల్లీలోని తిస్‌ హజారీ కోర్ట్ లో `గృహ హింస నుంచి మహిళల రక్షణ` చట్టం కింద మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది. తిస్‌ హజారీ కోర్ట్ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ శ్రీమతి తానియా సింగ్‌ ముందు కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలో కోర్ట్ హనీ సింగ్‌ని నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా హనీసింగ్‌ని కోర్ట్ ఆదేశించింది. హనీ సింగ్‌, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  2014లో `రాస్టార్‌` అనే రియాలిటీ షోలో హనీ సింగ్‌ తన భార్యను జనాలకు పరిచయం చేశాడు. బాలీవుడ్‌లోని పలు భారీ ప్రాజెక్ట్స్‌లో పని చేయడానికి ముందే హనీ సింగ్‌ వివాహం అయిందని తెలిసి చాలా మంది షాక్‌ అయ్యారు. 

దీపికా పదుకోనె, సైఫ్‌ అలీఖాన్‌ జంటగా నటించిన `కాక్‌టెయిల్‌` చిత్రంలోని ఆంగ్రేజీ బీట్‌ పాటతో హనీ సింగ్‌ బాగా ప్రాచుర‍్యం పొందారు. ఈ పాట సూపర్‌ హిట్‌ అవ్వడమే కాకా 2011లో టాప్‌ సాంగ్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హనీ సింగ్‌ బాలీవుడ్‌ కెరీర్‌ సాఫీగా కొనసాగుతుంది. ఇక భార్య ఇచ్చిన ఫిర్యాదులతో అతడి కెరీర్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. దీనిపై హనీసింగ్‌ ఎలా స్పందిస్తాడనేది ఇంట్రెస్ట్ గా మారింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం