మంచి మాటలకు ధన్యవాదాలుః మహేష్‌ ట్వీట్‌కి పీవీ సింధు స్పందన

Published : Aug 04, 2021, 09:01 AM IST
మంచి మాటలకు ధన్యవాదాలుః మహేష్‌ ట్వీట్‌కి పీవీ సింధు స్పందన

సారాంశం

మహేష్‌తోపాటు చిరంజీవి, అనసూయ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అభినందించారు. వీరికి ధన్యవాదాలు చెబుతుంది పీవీ సింధు. ఒక్కొక్కరికి పర్సనల్‌గా ఆమె థ్యాక్స్ చెప్పడం విశేషం.   

బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన మహిళగా చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు, అభినందనలు దక్కుతున్నాయి. సినిమా, రాజకీయ ప్రముఖులు, సాధారణ ప్రజానికం అనే తేడా లేకుండా అందరు ఆమెని అభినందిస్తున్నారు. అందులో భాగంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సైతం పీవీ సింధుని అభినందించారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. 

`మరో చారిత్రాత్మక విజయం. భారతదేశానికిది అత్యత్తమ విజయం. కాంస్యం గెలిచినందుకు అభినందలు పీవీ సింధు. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. మహేష్‌తోపాటు చిరంజీవి, అనసూయ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అభినందించారు. వీరికి ధన్యవాదాలు చెబుతుంది పీవీ సింధు. ఒక్కొక్కరికి పర్సనల్‌గా ఆమె థ్యాక్స్ చెప్పడం విశేషం. 

మహేష్‌ ట్వీట్‌కి స్పందిస్తూ, `మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు మహేష్‌బాబు. నేను దానికి విపరీతంగా అభినందిస్తున్నా` అని తెలిపింది పీవీ సింధు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో మహేష్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్‌లో ఓడిన పీవీ సింధు కాంస్యం కోసం చైనాకి చెందిన హీ బింగ్‌ జియావో తో తలపడి విజయం సాధించింది. ఇది ఇండియాకి మరపురాని విజయంగా నిలిచింది. 

మహేష్‌ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. మహేష్‌ బర్త్ డే సందర్భంగా సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌