
బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఒక్క మూవీ చేయలేదు. అయినా ఆయన క్రేజ్ అక్కడ ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ అతనితో జత కట్టాలని తహతహలాడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ విజయ్ దేవరకొండ తమ ఫేవరేట్ స్టార్ అని చెప్పారు. అలాగే ఆయనతో నటించాలని ఉందన్న కోరిక బయటపెట్టారు. తాజాగా సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని ఓపెన్ అయ్యింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా ఈ కామెంట్స్ చేశారు.
సార్ కిడ్ సారా అలీ ఖాన్(Sara Ali Khan) కి ఇంకా సరైన బ్రేక్ దక్కలేదు. ఓ మోస్తరు విజయాలు దక్కినప్పటికీ బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరలేదు. ప్రస్తుతం ఆమె 'అత్రాంగి రే' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా నటిస్తున్నారు. ధనుష్ కి జంటగా సారా అలీఖాన్ కనిపించనుంది. విడుదలకు 'అత్రాంగి రే' సిద్ధం అవుతుండగా.. సారా అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ధనుష్ (Dhanush)తో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పిన సారా అలీ ఖాన్ ని.. ధనుష్ కాకుండా మీరు నటించాలని కోరుకుంటున్న సౌత్ స్టార్ ఎవరని అడుగగా... టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఆయన గ్రేట్ యాక్టర్... సూపర్ కూల్ . అలాగే సో హాట్ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూ సాక్షిగా సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ పట్ల తన అభిప్రాయం తెలియజేసింది.
స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచమైన సారా అలీఖాన్... సౌత్ ఇండియాలో ఇంకా అడుగుపెట్టలేదు. అలాగే శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా ఎంట్రీ ఇవ్వలేదు. వీరి పేర్లు ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ పక్కన నటిస్తున్నారంటూ తరచూ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇంకా కార్యరూపం దాల్చలేదు .
Also read తన ఫోటోపై వర్మ సెటైర్... మంచు లక్ష్మి షాకింగ్ రిప్లై
మరోవైపు విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది. లైగర్ మూవీలో విజయ్ దేవరకొండకు జంటగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు.
Also read Samantha: చరణ్ మరదలు పెళ్ళిలో సమంత సందడి... క్లోజ్ ఫ్రెండ్ తో పాటు హాజరైన స్టార్ లేడీ