
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం Sarkaru Vaari Paata చిత్రంలో నటిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మహేష్ నటిస్తున్న ఫుల్ మాస్ మసాలా చిత్రం ఇది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైంది. మహేష్ బాబు యాటిట్యూడ్, స్టైల్ అదరగొట్టే విధంగా ఉన్నాయి.
Mahesh Babu సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలు, కుటుంబ విశేషాలని మహేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటాడు. మహేష్ బాబుని ట్విట్టర్ వేదికగా 12 మిలియన్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అరుదైన రికార్డ్ సాధించాడు.
సర్కారు వారి పాట చిత్ర ఫస్ట్ లుక్ ని మహెష్ బాబు జూలైలో తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశాడు. కారులో నుంచి దిగుతున్న మహేష్ లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. ఈ ఏడాది అత్యధికంగా కోట్ చేయబట్ట ట్వీట్ గా అది రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని ట్విటర్ ఇండియా అధికారికంగా ప్రకటించడం విశేషం.
సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ పేరుతో ఫస్ట్ లుక్ విడుదలయింది. ముందుగా ఈ చిత్రానికి సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీనితో ఈ చిత్రాన్ని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు.
ఈ మూవీలో మహేష్ బాబుకి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సమ్మర్ లో ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read: చిరుత డ్రెస్ లో బ్రీత్ టేకింగ్ హాట్.. ఇంతటి అందాల ఘాటు మలైకాకి మాత్రమే సాధ్యం