అజ్ఞాతంలో కోలీవుడ్ స్టార్ కమెడియన్

Published : Oct 12, 2017, 12:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
అజ్ఞాతంలో కోలీవుడ్ స్టార్ కమెడియన్

సారాంశం

అజ్ఞాతంలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ గా వెలుగొందుతున్న సంతానం ఓ డీల్ లో సంబంధాలు చెడిపోవడంతో ఫైటింగ్ కొట్లాటలో ప్రత్యర్థులకు గాయాలు కావటంతో పోలీసు కేసు

తమిళ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ కమేడియన్ గా ఒక వెలుగు వెలిగిన సంతానం ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నాడు. ఒకానొక టైం లో హీరో స్థాయి కి కూడా వెళ్ళిన సంతానం అనుకోని పరిస్థితి లో ఇప్పుడు అజ్ఞాతం లోకి వెళ్ళడం షాకింగ్ గా మారింది. సినిమా నటులు తాము సంవత్సరాల పాటు సంపాదించిన ఆదాయంతో ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.

 

అలాగే సంతానం కూడా ఒక కాంట్రాక్టర్ తో కలిసి కుంద్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందులో తన భాగం మొత్తానికి సంబంధించి డబ్బుని నిర్మాణం కంటే ముందరే ఆయనకి ఇచ్చేసాడు. నిర్మాణం టై లో అభిప్రాయ బేధాల కారణంగా ఆయన వైదొలిగాడు. కాంట్రాక్టర్ కొంత డబ్బు సంతానంకి ఇచ్చేసాడు కూడా. మిగితా మొత్తం కోసం ఎప్పటి నుంచో సంతానం అతని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అదే నేపథ్యంలో తన మేనేజర్ తో కలిసి సంతానం అతని ఆఫీస్ కి వెళ్ళాడు. 

 

ఈ సమయంలో అక్కడ సదరు భాగస్వామి షణ్ముగసుందరంతో పాటు, ఆయన మిత్రుడు, స్థానిక బీజేపీ నాయకుడైన న్యాయవాది ప్రేమానంద్‌ కూడా అక్కడే ఉన్నారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణకు దారితీసింది. ఆ గొడవలో ముగ్గురూ గాయపడ్డారు. ఆ టైంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సంతానం చికిత్స కూడా పొందాడు, అదే ఆసుపత్రి లో షణ్ముగ సుందరం కూడా జాయిన్ అయ్యాడు.

 

ఇంతలో ప్రేమానంద్ గాయపడ్డాడని తెలుసుకున్న కార్యకర్తలు, ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు నమోదు చేసి స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. పోలీసులు సంతానం మీద మూడు సెక్షన్ లపై కేసు నమోదు చేసారు. దీంతో సంతానం అజ్ఞాతం లోకి వెళ్ళిపోయారు. ఆయన దొరకగానే అరెస్ట్  చేసే ఛాన్స్ ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ