Sankranthi 2022: ఓటీటీలో సంక్రాంతి సందడి!

Published : Jan 04, 2022, 11:01 AM ISTUpdated : Jan 10, 2022, 08:30 PM IST
Sankranthi 2022: ఓటీటీలో సంక్రాంతి సందడి!

సారాంశం

ఓటీటీలో బడా చిత్రాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. పుష్ప, అఖండ వంటి భారీ చిత్రాలతో పాటు ప్రేక్షకాదరణ అందుకున్న పెళ్లి సందడి.. సంక్రాంతికి తెలుగు ఇళ్లలో కుటుంబ సభ్యులను ఎంటర్టైన్ చేయనున్నాయి. 

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదల వాయిదా సంక్రాంతి సినిమా మూడ్ మొత్తం నాశనం చేసింది. ఇక అందరూ ఆశలు రాధే శ్యామ్ చిత్రం మీద పెట్టుకున్నారు. రాధే శ్యామ్ విడుదలపై కూడా స్పష్టత లేదు. ఖచ్చితంగా జనవరి 14న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటన చేయడం లేదు. ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అంటూ  అధికారిక ప్రకటన జరిగిన వెంటనే చిన్న చిత్రాలు సంక్రాంతి బరిలో దూకాయి. అరడజనుకు పైగా చిత్రాలు విడుదల తేదీలు ప్రకటించాయి. వీటిలో బంగార్రాజు ఒక్కటే స్టార్ హీరో మూవీ అని చెప్పాలి. మొత్తంగా థియేటర్స్ లో 2022 సంక్రాంతి (Sankranthi 2022) చాలా సప్పగా సాగనుందనిపిస్తుంది. 

అయితే ఓటీటీలో బడా చిత్రాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. పుష్ప, అఖండ వంటి భారీ చిత్రాలతో పాటు ప్రేక్షకాదరణ అందుకున్న పెళ్లి సందడి.. సంక్రాంతికి తెలుగు ఇళ్లలో కుటుంబ సభ్యులను ఎంటర్టైన్ చేయనున్నాయి. థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ, పుష్ప సంక్రాంతి కానుకగా ఓటీటీలో స్ట్రీమ్ కానున్నాయి. ఈ చిత్రాల ఓటీటీ హక్కులు దక్కించుకున్న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పండగ సీజన్ క్యాష్ చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. 

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ (Akhanda) బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. విడుదలై నెలరోజులు దాటిపోతున్నా వసూళ్లు రాబడుతుంది. వరల్డ్ వైడ్ గా రూ.115 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది అఖండ. ఈ మూవీ డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. అఖండ మూవీ జనవరి 14న ఈ సంస్థ స్ట్రీమ్ చేయనుందట. దీంతో పెద్ద పండగ వేళ బాలయ్య బుల్లితెరను ఊపేయనున్నారు. 

ఇక పుష్ప మూవీతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు అల్లు అర్జున్ (Allu Arjun). తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషల్లో పుష్ప రికార్డు వసూళ్లు రాబడుతుంది. పుష్ప వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇంకా థియేటర్స్ లో రన్ కొనసాగుతుండగా ఈ లెక్కలు మరింత పెరిగే సూచనలు కలవు. పుష్ప (Pushpa) జోరు థియేటర్స్ లో తగ్గకముందే ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం. పుష్ప డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుంది. పుష్ప సైతం జనవరి 7 నుండి అందుబాటులోకి రానుందట. 

Also read RRR:ఎన్టీఆర్, రామ్ చరణ్ బాగా డిప్రెస్ అయ్యారా ? సాక్ష్యం ఇదే??

ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది పెళ్లి సందడి. శ్రీకాంత్ కొడుకు రోషన్-శ్రీలీల హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో కే రాఘవేంద్రరావు ఓ రోల్ చేయడం విశేషం. పెళ్లి సందడి మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుందని సమాచారం. పెళ్లి సందడి సినిమా సైతం జనవరి 14న విడుదల చేయనున్నారట. ప్రజాదరణ దక్కించుకున్న అఖండ, పుష్ప, పెళ్లి సందడి బుల్లితెరపై సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనున్నాయి. 

Also read NBK 107: బాలయ్య విలన్ గా స్టార్ హీరో

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్