
దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈచిత్రం విడుదల కావాల్సివుంది. అయితే.. కరోనా విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో, వేరే దారి లేక ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర టీమ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఎంత ప్రయత్నించినా, అనుకున్న సమయంలో సినిమాని తీసుకురాలేకపోతున్నామని, అయితే ఎవరూ నిరుత్సాహానికి గురికావొద్దని, సరైన తరుణంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొంది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ పై పెట్టిన ఖర్చు మొత్తం నష్టపోయినట్లే అంటున్నారు. అయితే అసలు ఎంత ఖర్చు ప్రమోషన్స్ పై పెట్టారు,లాస్ అయ్యారనే విషయమై ప్రముఖ బాలీవుడ్ మూవీ వెబ్ సైట్స్ కోమలి, Bollywood Hungama రాసుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కు జనాలను తీసుకెళ్లారని,దానికి భారీగా ఖర్చుపెట్టారని ఆ లెక్కలూ చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది.
బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు RRR నిర్మాతలు దాదాపుగా 18-20 కోట్లు దాకా ప్రమోషన్స్ పై ఖర్చు పెట్టారు. అందులో కేవలం 2నుంచి 3 కోట్లు దాకా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ప్రమోషన్ పర్పస్ కు ఆంద్రా కు ఆవల చేసే ఈవెంట్స్ కు ట్రాన్సపోర్ట్ చేయటానికే సరిపోయింది. అందులో నిజమెంత ఉందో కానీ బాలీవుడ్ మీడియా లాజిక్ ఏమిటంటే..రాజమౌళికు తెలుసు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు రెండు తెలుగు రాష్ట్రాల ల దాటి ఆవల ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.
ముఖ్యంగా ముంబైలో చేసే మీడియా లేదా మార్కెటింగ్ ఈవెంట్స్ కు, కేరళ,తమిళనాడులో చేసిన ప్రమోషన్ ఈవెంట్స్ కు ఆంధ్రా ఫ్యాన్స్ ని తీసుకొచ్చారు. వారికి లక్జరీ హోటల్స్ ఇచ్చారు. వారు ఈవెంట్స్ కు వచ్చి పాల్గొని, చప్పట్లు కొట్టడం,విజిల్స్ వేయటం వంటివి చేయాలి అంటూ రాసుకొచ్చారు. ఈ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయమై ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : RRR:ఎన్టీఆర్, రామ్ చరణ్ బాగా డిప్రెస్ అయ్యారా ? సాక్ష్యం ఇదే??
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.
Also Read : RRR Loss: `ఆర్‌ఆర్‌ఆర్` వాయిదా.. ప్రమోషన్స్ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనా?