ఇప్పుడు ఎన్టీఆర్ వంతు, ఇక విశ్వరూపమే.. రంగంలోకి బాలీవుడ్ డైరెక్టర్

By telugu team  |  First Published Oct 24, 2021, 7:51 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Jr NTR తదుపరి కొరటాల శివ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఆ తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ చిత్రానికి కమిటయ్యాడు. ఈ రెండూ కాకుండా ఎన్టీఆర్ మరో దిగ్గజ దర్శకుడితో పనిచేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో కళాత్మక చిత్రాలు తెరకెక్కిస్తున్న ప్రముఖ దర్శకుడు Sanjay Leela Bhansali తాజాగా ఎన్టీఆర్ ని మీట్ అయినట్లు తెలుస్తోంది. కథా చర్చలు పూర్తయ్యాయని ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. 

Latest Videos

పౌరాణిక నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఎన్టీఆర్ అభిమానులకు ఇది గ్రేట్ న్యూస్ అని చెప్పాలి. పౌరాణిక చిత్రాలు అంటే ముందుగా నందమూరి ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ లెక్కలేనన్ని పౌరాణిక చిత్రాల్లో రాముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా, అర్జునుడిగా నటించి మెప్పించారు. తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశారు. ఇక బాలయ్య కొన్ని చిత్రాల్లో పౌరాణిక పాత్రలు వేశారు. 

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వంతు.. ఎన్టీఆర్ చిన్నప్పుడు బాలరామాయణం చిత్రంలో నటించాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ పౌరాణిక చిత్రం చేస్తే బావుంటుంది అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ రీమేక్ చేయాలని కూడా ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. 

Also Read: బికినీలో నాగ్ హీరోయిన్ రచ్చ.. రోజురోజుకూ హద్దులు దాటేస్తున్న హాట్ బ్యూటీ

సంజయ్ లీలా భన్సాలీ చిత్రం త్వరగా పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు. దీనిపై జోరుగా ప్రచారం మొదలైపోయింది. మంచి రోల్ పడితే ఎన్టీఆర్ ఎలా నటిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యమదొంగ చిత్రంలో కాసేపు యముడి గెటప్ లో దర్శనమిచ్చి ఉర్రూతలూగించాడు. అలాంటిది ఫుల్ లెన్త్ రోల్ లో పౌరాణిక గాధ చేస్తే.. వెండితెరపై నట విశ్వరూపమే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్, భన్సాలీ మూవీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. 

click me!