సమంతకు ఆమె ఎందుకు అంత ప్రత్యేకం?

Published : Oct 24, 2021, 05:05 PM IST
సమంతకు ఆమె ఎందుకు అంత ప్రత్యేకం?

సారాంశం

సమంతకు Shilpa reddy ఎందుకు అంత ప్రత్యేకం అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయిన శిల్పారెడ్డితో చాలా ఏళ్లుగా సమంతకు పరిచయం ఉంది. పరిశ్రమతో సంబంధం లేకున్నా వీరి పరిచయం అనేది గొప్ప స్నేహంగా మారింది.

సమంత విడాకుల ప్రకటన సినీవర్గాలతో పాటు ఆమె అభిమానులలో కలకలం రేపింది. అందమైన జంటగా పేరును Samantha, చైతు విడిపోవడం చాలా మందిని బాధకు గురిచేసింది. కాగా సమంత విడాకుల బాధను అధిగమించేందుకు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత చార్ ధామ్ యాత్రలో పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలను సందర్శిస్తున్నారు. ఈ యాత్రలన్ని సమంత తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి చేస్తున్నారు. ఎప్పుడు చూసినా సమంత, శిల్పారెడ్డి ఆమె కుటుంబంతో కలిసి గడుపుతున్నారు. దీనితో శిల్పారెడ్డి పేరు కూడా మీడియాలో ప్రధానంగా వినిపిస్తుంది. 

అదే సమయంలో సమంతకు Shilpa reddy ఎందుకు అంత ప్రత్యేకం అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయిన శిల్పారెడ్డితో చాలా ఏళ్లుగా సమంతకు పరిచయం ఉంది. పరిశ్రమతో సంబంధం లేకున్నా వీరి పరిచయం అనేది గొప్ప స్నేహంగా మారింది. వ్యాయామం, ఫుడ్ విషయంలో శిల్పారెడ్డి సమంతకు సలహాదారుగా ఉంటారు. శిల్పారెడ్డి సలహాలు క్రమం తప్పకుండా పాటిస్తుంది సమంత. 

Naga chaitanyaతో విబేధాల తరువాత సమంత శిల్పారెడ్డికి మరింత దగ్గరయ్యారు. సంతోషమైనా బాధైనా ఆమెతో పంచుకుంటున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలో శిల్పారెడ్డితో కలిసి అనేక టూర్స్ కి వెళ్లడం జరిగింది. ఓ నెల క్రితం గోవా టూరుకి శిల్పారెడ్డి ఫ్యామిలీ తో పాటు సమంత వెళ్లారు. సమంత సదరు ట్రిప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇటీవల డెహ్రాడూన్ లో వారం రోజులు శిల్పారెడ్డి సమంత గడపడం జరిగింది. తాజాగా హిమాయలలో ఉన్న పుణ్య క్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్  వంటి ఆలయాలను కలిసి దర్శించుకున్నారు. 

Also read Bigg boss telugu 5 చెంప పగిలిపోతుందని ఎన్ని సార్లు అంటావ్ ప్రియ... ఆమెకు నాగార్జున క్లాస్

స్నేహం అనే ఎంతో విలువనిచ్చే సమంత శిల్పారెడ్డిని అమితంగా ప్రేమిస్తారని తెలుస్తుంది. చైతన్యతో విబేధాలు, విడాకులు వంటి కీలక విషయాలు ఆమె శిల్పారెడ్డితో అందరికంటే ముందుగా చర్చించారని వినికిడి. మరోవైపు సమంత కొత్త చిత్రాల ప్రకటన చేస్తున్నారు. దసరా కానుకగా ఓ మూవీని సమంత ప్రకటించారు. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 

Also read గోవా బీచ్ లో అలాంటి ఫోజులో... సెగలు రేపుతున్న నిహారిక బోల్డ్ లుక్
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bhooth Bangla: ఈ ఏడుగురు స్టార్స్ లో బాగా చదువుకుంది ఎవరో తెలుసా ? వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవే
Tabu Real Name: టబు అసలు పేరేంటి? తండ్రి ఇంటిపేరు ఎందుకు వాడరు? ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే