యూట్యూబ్ ఛానల్స్ ని టార్గెట్ చేసిన మంచు విష్ణు.. హీరోయిన్లపై అసభ్యంగా..

By telugu team  |  First Published Oct 24, 2021, 5:53 PM IST

'మా' అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంచు విష్ణు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. 'మా'లో మహిళా సభ్యుల సాధికారత కోసం ఓ కమిటీని నియమించబోతున్నట్లు విష్ణు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.


'మా' అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంచు విష్ణు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. 'మా'లో మహిళా సభ్యుల సాధికారత కోసం ఓ కమిటీని నియమించబోతున్నట్లు విష్ణు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న జరిగిన మా ఎన్నికల్లో విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించాడు. 

తాజాగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జర్నలిస్టులు కొత్తగా MAA President గా బాధ్యతలు చేపట్టిన Manchu Vishnu ని సత్కరించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాకు సన్మానం చేసిన ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ కి ధన్యవాదాలు. నేను చిన్నప్పటి నుంచి ఎందరో గొప్ప జర్నలిస్టుల కళ్ళ ముందు పెరిగాను. 

Latest Videos

మనందరిది ఒకటే కులం.. సినిమా కులం. ఇండియాలో తెలుగు సినీ జర్నలిస్టులు మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. హద్దులు దాటకుండా వార్తలు వేస్తారు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి సమస్య ఉంది. దారుణంగా ప్రవర్తిస్తూ థంబ్ నెయిల్స్ వేస్తున్నారు. నటీనటులపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. 

హీరోయిన్లు, నటీమణులు మన ఆడపడుచులు.. వారిని మనం గౌరవించాలి. హీరోయిన్లపై అసభ్యకరమైన వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదు అని మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి జర్నలిస్టుల సహకారం కావాలని కోరారు. హీరోయిన్లపై అసభ్యకర కామెంట్స్ తో వీడియోలు చేసే వారిపై నిఘా పెట్టేందుకు ఓ సెల్ ఏర్పాటు చేయబోతున్నాం. అలాంటి వారు తప్పించుకోలేరు అని విష్ణు హెచ్చరించాడు. 

Also Read: నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే, గతాన్ని గుర్తు చేసుకుంటూ.. సన్నీ లియోన్ హాట్ కామెంట్స్

ఇటీవల Samantha కూడా తన వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. 

click me!