టాప్ దర్శకుడు సంజయ్ లీలాపై సెట్స్ లో భీకర దాడి

Published : Jan 27, 2017, 01:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
టాప్ దర్శకుడు సంజయ్ లీలాపై సెట్స్ లో భీకర దాడి

సారాంశం

బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపైలసెట్స్ లోనే దాడి జైపూర్ నగరంలో పద్మావతి చిత్ర షూటింగ్ సందర్భంగా రాజ్ పుత్ ల దాడి పద్మావతి రాణిపై తప్పుడు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారంటూ ఎటాక్

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీపై దాడి జరిగింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పద్మావతి' చిత్రం షూటింగ్ జరుగుతుండగా... ఆందోళనకారులు కొందరు సెట్స్ లోకి ప్రవేశించి దాడికి ఒడిగట్టారు. సెట్స్ ను ధ్వంసం చేయడంతో పాటు భన్సాలీని కొట్టి జుట్టుపట్టి లాక్కెల్లారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ కోటలో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

 

రాజ్ పుత్ వంశానికి చెందిన రాణి పద్మిణిని అవమానపరిచేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ... రాజ్ పుత్ కర్ణి సేన సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాలతో షూటింగ్ ఆగిపోవడంతో పాటు సెట్స్ లో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. 'పద్మావతి' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె టైటిల్ రోల్ చేస్తోంది. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సంగ్ నటిస్తున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు సినిమాలో సన్నివేశాలు చిత్రీకరిస్ర్తున్నారంటూ దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

 

పద్మిణి రాణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ వ్యవహారం లేనే లేదని, అదేదో వారిద్దరి మధ్య నడిచినట్లు చూపిస్తూ చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని, పద్మిణి ఆత్మాభిమానం గల రాణి అని, చిట్టోర్‌గఢ్ కోటపై దాడి జరిగినపుడు ఆమె అల్లావుద్దీన్ కు లొంగిపోకుండా ఆత్మత్యాగం చేసిందని ఆందోళనకారులు వాదిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, 'పద్మావతి' సినిమాలో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్లు చూపిస్తే ఊరుకోబోమని ఆందోళన కారులు హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Box Office Collections: క్రిస్మస్ సినిమాల కలెక్షన్లు.. ఏ సినిమా టాప్‌లో ఉందంటే?
Chitrangada Singh: ముసుగు లేకుండా నిజాయతీగా ఉండేది ఆయన ఒక్కడే.. సూపర్ స్టార్ పై నటి కామెంట్స్