క్రిష్ డైరెక్ష‌న్ లోనే మోక్షజ్ఞ మూవీ

First Published Jan 27, 2017, 3:29 AM IST
Highlights
  • ఓ చారిత్రక కథ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ అవుతున్న మోక్షజ్ఞ
  •  గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు పులోమావి కథనే సినిమాగా తీస్తున్న మోక్షజ్ఞ
  •  తన తనయుడి సినిమా బాధ్యతను మొత్తం క్రిష్ పై పెట్టిన బాల‌య్య

శాతకర్ణి సినిమా అంతా. యుద్ధ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మోక్షజ్ఞ సినిమాను ప్రేమకథా నేపథ్యంలో తీస్తారని చెబుతున్నారు. చారిత్రక సినిమాలో ప్రేమకథా నేపథ్యమేంటని అనుకోవచ్చు. కానీ, వాశిష్టి శాతకర్ణి పుత్ర పులోమావి.. శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. దానిపైనే చారిత్రక అంశాల ఆధారంగా సినిమాగా మలుస్తారని అంటున్నారు.

వారి ప్రేమకథ ఆధారంగా ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్ రచించిన ‘శ్రావణి’ నవలను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తారని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. ఆ నవల ఒక్కటే కాదు.. పలు చారిత్రక ఆధారాలనూ సేకరించి అందులో జోడిస్తారట. సినిమాకు ఆ నవల టైటిల్‌నే పెడతారని టాక్. మరి, ఆ సినిమాను తెరకెక్కించే డైరెక్టర్ ఎవరు? అంటే మరో ఆసక్తికర అంశం ఇదే.

గౌతమిపుత్ర శాతకర్ణిని అద్భుతంగా మలచిన క్రిష్.. ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేస్తాడట. దీనిపై ఇప్పటికే క్రిష్‌తో బాలయ్య చర్చించాడట. తన తనయుడి సినిమా బాధ్యతను మొత్తం క్రిష్ భుజాలపైనే బాలయ్య పెట్టాడని చెబుతున్నారు

click me!