
వీలు దొరికినప్పుడల్లా మెగా హీరోస్ పై విరుచుకుపడే తత్వం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మది. మాటలతో కాదు షేర్ ఖాన్ ట్వీట్ లతో చంపేస్తా అంటూ జోరీగలా సతాయిస్తుంటాడు వర్మ. అందుకే మెగా హీరోస్ కు చిర్రిత్తింది. వరుసపెట్టి వర్మను వాయించేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు, ఇంటర్వ్యూల్లో మెగాస్టార్ వర్మ ను ఎండగట్టారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ వంతు. పవర్ స్టార్ కూడా వర్మ గురించి ప్రశ్నించగా బ్లూ ఫిలింలు కలెక్ట్ చేసుకునే వర్మ గురించి ఏం మాట్లాడుతాం అన్నాడు. ఓసారి పైకి ఎత్తేసి, ఇంకోసారి కిందకి దించేసే వ్యక్తుల గురించి నేనేం మాట్లాడాలి.? ఈ మధ్యనే కూతురుకు పెళ్ళయ్యింది. అలాంటి వ్యక్తి పోర్న్ సినిమాల్ని కలెక్ట్ చేస్తుంటానని చెప్తుంటే ఇంక మనం మాట్లాడాల్సిన అవసరముందా.?' అంటున్నారు పవన్.
ప్రత్యేక హోదా ఉద్యమంలో పవన్ చూపిస్తున్న తెగువ మహేష్‌బాబుకి లేదా.? అని వర్మ ప్రశ్నించాడు ట్విట్టర్‌లో. పవన్‌ని పొగిడేస్తూ పొగిడేస్తూ.. చివరికి పవన్‌పై సెటైర్లు షురూ చేసేశాడు వర్మ. నాయకుడు, యుద్ధ రంగంలో లేకపోతే సైన్యం ఏమయిపోతుంది.? అని వర్మ ప్రశ్నించిన విషయం విదితమే.
మొత్తమ్మీద వర్మ ట్వీట్లతో చిరాకు అనిపించి నాగబాబు ఎలాగైతే అసహనం వ్యక్తం చేశాడో, చిరంజీవి సున్నితంగానే ఎలా వర్మకి కౌంటర్ ఇచ్చారో, అచ్చం అలాగే పవన్ కూడా మీడియా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానంగా వర్మపై స్పందించడం కూడా అవసరమా అంటూ కొట్టిపారేశారు..