చిన్న సినిమా కోసం నిలబడ్డ ప్రభాస్‌.. సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..

Published : Jan 13, 2023, 10:27 PM IST
చిన్న సినిమా కోసం నిలబడ్డ ప్రభాస్‌.. సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..

సారాంశం

ప్రభాస్‌ ఒక చిన్న సినిమా కోసం అండగా నిలబడ్డారు. సంక్రాంతి బరిలో ఉన్న ఇద్దరు పెద్ద స్టార్‌ సినిమాల మధ్య వస్తోన్న ఓ చిన్న చిత్రం కోసం డార్లింగ్‌ సపోర్టింగ్‌గా ఉన్నారు.

ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. మూడు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఒక చిన్న సినిమా కోసం అండగా నిలబడ్డారు. సంక్రాంతి బరిలో ఉన్న ఇద్దరు పెద్ద స్టార్‌ సినిమాల మధ్య వస్తోన్న ఓ చిన్న చిత్రం కోసం డార్లింగ్‌ సపోర్టింగ్‌గా ఉన్నారు. అదే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ `కళ్యాణం కమనీయం`. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌లో నిర్మితమైన ఈ చిత్రం కోసం మొదట్నుంచి సపోర్ట్ చేస్తున్నారు ప్రభాస్‌. 

ఆ మధ్య ప్రమోషనల్‌ వీడియోని విడుదల చేసి బిగ్‌ సపోర్ట్ ఇచ్చారు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఆయన బెస్ట్ విషెస్‌ తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ చిత్రాన్నికి అభినందనలు తెలియజేశారు ప్రభాస్‌. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాక్షించారు. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది. అందుకుగానూ చిత్ర బృందం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

సంతోష్‌ శోభన్‌ హీరోగా, కొత్త అమ్మాయి ప్రియా భవానీ శంకర్‌ టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రమిది. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 14న)  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే రోజు దిల్‌రాజు నిర్మిస్తున్న తమిళ చిత్రం `వారసుడు` తెలుగు డబ్బింగ్‌ విడుదల చేస్తున్నారు. ఓ వైపు చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణ `వీరసింహారెడ్డి`తోపాటు విజయ్‌ `వారసుడు` ఉండబోతున్నాయి. ఈ మూడు బడా సినిమాల మధ్యలో చిన్న సినిమాగా `కళ్యాణం కమనీయం` తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 

అయితే పెళ్లి నేపథ్యంలో మంచి సందేశాత్మకంగా, వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చిత్ర బృందం చెప్పింది. క్లీన్‌ యూ సర్టిఫికేట్ తో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని హీరోయిన్‌ ప్రియా భవానీ తెలిపారు. ఆమె శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. తెలుగులో మంచి వినోదాత్మక, సెన్సిబుల్‌ చిత్రంతో రావడం ఆనందంగా ఉందని చెప్పింది. ప్రతి తల్లి, చెల్లి, కూతురు తన పాత్రతో రిలేటెడ్ అవుతారని తెలిపింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?
Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని