ఆ స్టార్ హీరో కూతురికి బాయ్ ఫ్రెండ్ నరకం చూపించాడట!

Published : Feb 05, 2021, 09:30 AM IST
ఆ స్టార్ హీరో కూతురికి బాయ్ ఫ్రెండ్ నరకం చూపించాడట!

సారాంశం

కొన్నేళ్ల క్రితం త్రిశాలా ఓ వ్యక్తిని ఇష్టపడ్డారట. అతనితో డేటింగ్ చేద్దాం ఆలోచించు అని చెప్పారట. అయితే త్రిశాలా ఎంతగానో ఇష్టపడుతున్న ఆ వ్యక్తి మాత్రం ఆమెను చాలా చీఫ్ గా ట్రీట్ చేసేవాడట. ఆమె ఏమి చేసినా విమర్శించడం, తప్పులు వెదకడం చేసేవాడట. చివరికి త్రిషాలా మిత్రులతో కలిసినా అతను ఇస్టపడేవాడు కాదట.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూతురు త్రిశాలా దత్ సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గతంలో తాను ఇష్టపడిన వ్యక్తి నుండి ఎదుర్కొన్న మానసిక వేదన, ఇబ్బందుల గురించి ఆమె ఓపెన్ అయ్యారు.  త్రిశాలా దత్ న్యూయార్క్ లో సైకో థెరపిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ ఛాట్ చేశారు. ఈ సంధర్భంగా ఓ అభిమాని,  మీరు గతంలో ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉన్నారా, ఉంటే ఆ అనుభవాలేంటి అని అడుగగా.. ఆమె సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 

కొన్నేళ్ల క్రితం త్రిశాలా ఓ వ్యక్తిని ఇష్టపడ్డారట. అతనితో డేటింగ్ చేద్దాం ఆలోచించు అని చెప్పారట. అయితే త్రిశాలా ఎంతగానో ఇష్టపడుతున్న ఆ వ్యక్తి మాత్రం ఆమెను చాలా చీఫ్ గా ట్రీట్ చేసేవాడట. ఆమె ఏమి చేసినా విమర్శించడం, తప్పులు వెదకడం చేసేవాడట. చివరికి త్రిషాలా మిత్రులతో కలిసినా అతను ఇస్టపడేవాడు కాదట. అతనికి కోసం మిత్రులతో గడపడాన్ని కూడా ఆమె వదులుకున్నారట. ఎప్పటికైనా మారతాడనే ఆశతో కొన్నిరోజులు భరించారట. 

అయితే కాలం గడిచే కొద్దీ అతని ప్రవర్తన ఇంకా దిగజారడంతో, అతనితో బంధాన్ని తెంచుకోవడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నారట. ఆ విధంగా ఓ వ్యక్తితో తన రిలేషన్ చేదుగా సాగిందని త్రిశాలా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక డ్రగ్స్ కి బానిసైన తన తండ్రి సంజయ్ దత్ ని కూడా తన సలహాలతో బయటపడవేసినట్లు త్రిశాలా ఈ సంధర్భంగా తెలియజేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?