హర్రర్‌ అంటే భయమంటోన్న అడవి శేషు..`మరణం` నచ్చిందట..

Published : Feb 04, 2021, 09:17 PM IST
హర్రర్‌ అంటే భయమంటోన్న అడవి శేషు..`మరణం` నచ్చిందట..

సారాంశం

అడవి శేష్‌ కమర్షియల్‌ సినిమాలకు అతీతంగా కంటెంట్‌తో కూడిన సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం `మేజర్‌`, `హిట్‌2` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయనకు హర్రర్‌ సినిమాలంటే భయమట. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

`క్షణం`, `ఎవరు` వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలతో విజయాలను అందుకున్నారు అడవిశేషు. కమర్షియల్‌ సినిమాలకు అతీతంగా కంటెంట్‌తో కూడిన సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం `మేజర్‌`, `హిట్‌2` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయనకు హర్రర్‌ సినిమాలంటే భయమట. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వీర్‌ సాగర్‌, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో, వీర్‌ సాగర్‌ దర్శకత్వంలో హ్రరర్‌ చిత్రం `మరణం` రూపొందుతుంది. ఓషియన్‌ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. 

ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని అడవిశేషు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `పోస్టర్‌ బాగుందని, భయపెట్టేలా ఉందన్నారు. ఈ సందర్భంగా తనకు హర్రర్‌ సినిమాలంటే భయమని చెప్పారు. కానీ చాలా మంది ప్రేక్షకులు ఇలాంటి హర్రర్‌ చిత్రాలను చూసేందుకు ఇష్టపడతారని, ఈ చిత్ర పోస్టర్‌, టీజర్‌ బాగున్నాయని, ఆసక్తికరంగా సాగుతుందని, సక్సెస్‌ సాధించాలని చెప్పారు. హీరో, దర్శకుడు వీర్ సాగర్ మాట్లాడుతూ, మా `మరణం` సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అడివి శేష్ గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. మా సినిమా విజయానికి ఇది మా మొదటి అడుగు. నన్ను నా కథను నమ్మి మా చిత్రాన్ని నిర్మించిన  మా నిర్మాత బి రేణుక గారికి నా ధన్యవాదాలు` అని చెప్పారు. 

``మరణం` సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమా లో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా హీరో డైరెక్టర్ వీర్ సాగర్ గారికి ధన్యవాదాలు. కరోనా టైం లో లాక్ డౌన్ లో సినిమా చేశాము. అవుట్ ఫుట్ బాగా వస్తుంది. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మా టీం కి ధన్యవాదాలు` అని చెప్పింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు