
టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్, ప్రభాస్ మరియు పవన్ తమ కొత్త చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ మొదటి షెడ్యూల్ మొదలు కాగా, మహేష్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. సంబంధించిన ఫోటోలు లీక్ కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీతో పాటు, అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. అయ్యప్పనుమ్ కోశియుమ్ షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ లోనే పవన్ పై ఓ యాక్షన్ సన్నివేశం తెరకెక్కించారు. శత్రువుల అంతు చూడడానికి బులెట్ పై వెళుతున్న పవన్ ఫోటో సెట్స్ నుండి బయటికి రాగా ఆసక్తి రేపింది.
మరో వైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూడు చిత్రాల షూటింగ్స్ ఏక కాలంలో నడిపిస్తున్నాడు. రాధే శ్యామ్ షూటింగ్ ఎప్పటి నుండో జరుగుతుండగా, ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ షూటింగ్ మొదలైంది. తెలంగాణా రాష్ట్రంలోని గోదావరి ఖనిలోని మైనింగ్ ఏరియాలో షూటింగ్ మొదలు కాగా, ప్రభాస్ పై యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సలార్ సెట్స్ నుండి ఆ ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ కావడం జరిగింది. ఇలా ముగ్గురు టాప్ స్టార్స్ పవన్, మహేష్ మరియు ప్రభాస్ తమకు కొత్త చిత్రాల షూటింగ్ యాక్షన్ తో షురూ చేశారు.