సందీప్ రెడ్డి వంగా యానిమల్ ప్రీటీజర్... ఊచకోత కోస్తున్న రన్బీర్!

Published : Jun 11, 2023, 01:09 PM ISTUpdated : Jun 11, 2023, 04:27 PM IST
సందీప్ రెడ్డి వంగా యానిమల్ ప్రీటీజర్... ఊచకోత కోస్తున్న రన్బీర్!

సారాంశం

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ప్రీ టీజర్ విడుదల చేశారు. రన్బీర్ కపూర్ ఊచకోత కోయడం గూస్ బంప్స్ రేపుతోంది.   


దర్శకుడు సందీప్ రెడ్డి డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డి తో సెన్సేషన్స్  క్రిటియేట్ చేశారు. విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి చిత్రం ఓవర్ నైట్ స్టార్ చేసింది. అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సక్సిస్ అయ్యారు. అర్జున్ రెడ్డికి మించిన విజయం కబీర్ సింగ్ నమోదు చేసింది. కబీర్ సింగ్ మూవీతో సందీప్ రెడ్డి బాలీవుడ్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు. రన్బీర్ కపూర్ ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. 

వీరి కాంబోలో తెరకెక్కుతున్న యానిమల్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 11న యానిమల్ ఐదు భాషల్లో విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. నేడు యానిమల్ చిత్ర ప్రీ టీజర్ విడుదల చేశారు. కపాలం మాస్క్ పెట్టుకొని ఉన్న గ్యాంగ్ హీరో రన్బీర్ మీద అటాక్ చేయగా, ఆయన ఊచకోత కోశారు. భయంతో పరుగులు తీయించారు. యానిమల్ మూవీ ప్రీ టీజర్ రక్తపాతాన్ని తలపించింది. 

యానిమల్ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేస్తున్నారు. టి సీరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక రన్బీర్ కపూర్ గత చిత్రం బ్రహ్మాస్త్ర పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఆయన ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. యానిమల్ రన్బీర్ హిట్ దాహం తీర్చే సూచనలు కలవు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?