ఆదిపురుష్ 10 వేల టికెట్లు కొన్న రామ్ చరణ్, ఏం చేయబోతున్నారు..?

Published : Jun 11, 2023, 11:26 AM IST
ఆదిపురుష్ 10 వేల టికెట్లు కొన్న రామ్ చరణ్, ఏం  చేయబోతున్నారు..?

సారాంశం

ఆదిపురుష్ సినిమా  దగ్గర పడుతున్న కొద్ది.. ప్రమోషన్ల జోరు పెరుగుతూనే ఉంది. దేశం అంత ఉత్కంటగా ఎదురు చూస్తున్న ఈసినిమా కోసం స్టార్ సెలబ్రెటీలు.. వేలల్లో టికెట్లుకొంటున్నారట. ఇంతకీ వేలలో టికెట్లు కొని ఏం చేస్తున్నారు. 


గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్‌. ఈ సినిమా రిలీజ్ కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దేశ వ్యాప్తంగా ఎందరో సినిమా లవర్స్ ఈమూవీని చూడటానికి ఆత్రుతతో ఉన్నారు. భారీ అంచనాల నడుమ.. భారీ బడ్జెట్ తో తెరకెక్కి.. రిలీజ్ కు రెడీగా ఉంది ఆదిపురుష్. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌ కనిపించనున్నాడు. సీతగా బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌, లంకేశుడిగా సైఫ్ అలీఖాన్  నటించారు.

ఎప్పటికప్పుడు వివాదాలు ఏదుర్కొంటూ.. అంచనాలు పెంచుకుంటూ..ప్రమోషన్లు పరుగులు పెట్టిస్తున్న ఈ  సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  రిలీజ్ కాబోతోంది. ఇక రిలీజ్ డేట్  రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.  అయితే ఈసారి విశేషం ఏంటీ అంటే.. ఎప్పుడు ఏ సినిమాకు లేని విధంగా.. కొత్త ఆచారానికి ఈ సినిమా నాందిపలుకుతోంది.  ఈసినిమా నుంచి వేల సంఖ్యలో టికెట్లను సెలబ్రిటీ స్టార్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ తమవంతుగా ఒక్కొక్కరు 10వేల చొప్పున సినిమా టికెట్లు కొనుగోలు చేశారు. 

అయితే వారు కొన్న టికెట్స్ వారికోసం కాదు.. బిజినెస్ చేయడా కోసం కూడా కాదు.. వారు ఆటికెట్లు కొని నిరుపేదలు, అనాథలకు ఆదిపురుష్‌ సినిమా ఉచితంగా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.అయితే తాజాగా  టాలీవుడ్‌ స్టార్‌ హీరో.. గ్లోబల్ స్టార్  రామ్‌చరణ్‌ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఆయన కూడా  10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనాథ పిల్లల కోసం టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌.  అంతే కాదు  అభిమానులకు సైతం ప్రత్యేకంగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. 

అయితే ఈ విషయం అఫీషియల్‌  గా మాత్రం అనౌన్స్ చేయలేదు.  ఆదిపురుష్‌ను పెద్ద ఎత్తున రిలీజ్‌ అవుతోంది. దేశవ్యాప్తంగా 6200కి పైగా స్క్రీన్లలో విడుదల చేయనుండగా.. తొలి రోజే రూ.100 కోట్ల కలెక్షన్లు లక్ష్యం మేకర్స్‌ పెట్టుకున్నారు. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌ను మూవీ తెరకెక్కగా దాదాపు రూ.1000కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, సినిమా టీజర్ టైమ్ లో వచ్చిన విమర్షలు దాటుకుని..  ట్రైలర్‌ ద్వారా మంచి మార్కులు వేయించుకున్నారు టీమ్. తిరుమల వివాదం, సైఫ్ అలీఖాన్ వివాదం. ఇలా ఆదిపురుష్ కు రకరకాల వివాదాలు చుట్టు ఉన్నాయి. మరి అవి సినిమాకు మైనస్ అవుతాయా..? ప్లాస్ అవుతాయా  చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు