
సమంత ప్రస్తుతం సెర్బియా దేశంలో ఉన్నారు. సిటాడెల్ లేటెస్ట్ షెడ్యూల్ అక్కడ జరుగుతుంది. సెర్బియా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సిటాడెల్ యూనిట్ మర్యాదపూర్వకంగా కలిశారు. వరుణ్ ధావన్, సమంత, రాజ్ అండ్ డీకే రాష్ట్రపతితో ఫోటో దిగారు. షూటింగ్ అనంతరం సెర్బియా దేశంలో సమంత ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఆమె ఓ ఇండియన్ పబ్ కి వెళ్లగా అభిమానులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆ పబ్ లో సమంత నటించిన ఊ అంటావా మామా సాంగ్ ప్లే చేశారు.
ఆ సాంగ్ కి సమంత డాన్స్ చేశారు. ఆమెతో పాటు పబ్ లో ఉన్న యూత్ లెగ్స్ షేక్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. పబ్ లో సమంత డాన్స్ చేయడం విశేషంగా మారింది. సమంత గట్స్, సింప్లిసిటీకి ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. 2021లో అల్లు అర్జున్ హీరోగా విడుదలైన పుష్ప ఇండియా వైడ్ మోతమోగించింది. సమంత చేసిన స్పెషల్ ఐటెం నెంబర్ ఊ అంటావా మామా యూత్ కి నిద్రదూరం చేయండి. బోల్డ్ స్టెప్స్ తో సమంత కాకరేపారు.
ఇక సమంత నటిస్తున్న సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సమంత-వరుణ్ మధ్య బోల్డ్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుండగా లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
అలాగే సమంత విజయ్ దేవరకొండకి జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది. సమంత ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారని సమాచారం. దర్శకుడు ఫిలిప్ జాన్ చెన్నై స్టోరీ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారట. వివేక్ కాల్రా హీరోగా నటించనున్న ఈ హాలీవుడ్ మూవీలో చెన్నై అమ్మాయిగా సమంత నటిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఇక శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది. సమంత కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా శాకుంతలం నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శాకుంతలం మూవీతో దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి.