సందీప్‌ కిషన్‌ బర్త్ డే స్పెషల్‌.. `టైగర్‌` డైరెక్టర్‌తో నయా మూవీ

Published : May 07, 2021, 12:57 PM IST
సందీప్‌ కిషన్‌ బర్త్ డే స్పెషల్‌.. `టైగర్‌` డైరెక్టర్‌తో నయా మూవీ

సారాంశం

తనకు `టైగర్‌` లాంటి సినిమాని అందించిన వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయబోతున్నారు. కథ, కథనాల ప్రకారం ఈ సినిమా సందీప్‌ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక మూవీగా నిలవనుంది.

ఇటీవల `ఏ1 ఎక్స్ ప్రెస్‌`తో విజయాన్ని అందుకున్న యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ తన బర్త్ డే (మే7) సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించారు. తనకు `టైగర్‌` లాంటి సినిమాని అందించిన వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయబోతున్నారు. కథ, కథనాల ప్రకారం ఈ సినిమా సందీప్‌ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక మూవీగా నిలవనుంది. కాన్సెప్ట్‌ వైజ్‌గా దర్శకుడు వీఐ ఆనంద్‌కు, పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్‌ కిషన్‌కు టైగ‌ర్‌ ఒక కొత్త త‌ర‌హా చిత్రం. ముఖ్యంగా సందీప్‌ కిషన్‌ పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేసిందని చెప్పవచ్చు.

దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత హీరో సందీప్‌కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో మరో మూవీ గా వస్తున్న ఈ చిత్రం కథ, కథనాలపై ఇండస్ట్రీలో అప్పుడే ఆసక్తికరమైన చర్చలు మొదలైయ్యాయి.  అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌లో సందీప్‌కిషన్‌ ఏదో ఒక మిస్టీరియస్‌ లొకేషన్‌ను ఐడెంటీఫై చేస్తున్నట్లుగా క‌నిపిస్తున్నారు. విభిన్న తరహా కథ, కథనాలు అందించే దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించిన దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు కూడా ఓ వినూత్నమైన, ప్రేక్షకులు ఊహించని కథను రెడీ చేశారు.

హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ గుట్ట ఈ సినిమాకు సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో  ప్రకటించనున్నారు. ప్రస్తుతం సందీప్‌ కిషన్‌ `గల్లీరౌడీ` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి జి. నాగేశ్వరరావు దర్శకుడు. దీంతోపాటు మహేష్‌ కోనేరు దర్శకత్వంలో తన 27వ చిత్రాన్ని చేస్తున్నాడు సందీప్‌ కిషన్‌. తన బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్‌ తెలియజేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు