వెళ్లి పడుకో: బిజెపి ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి హీరో సిద్ధార్థ్ స్ట్రాంగ్ కౌంటర్

Published : May 07, 2021, 10:28 AM ISTUpdated : May 07, 2021, 10:31 AM IST
వెళ్లి పడుకో: బిజెపి ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి హీరో సిద్ధార్థ్ స్ట్రాంగ్ కౌంటర్

సారాంశం

తాజాగా ఏపీ బీజేపీ కార్యదర్శికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. సిద్ధార్థ్‌ సినిమాలకు దావూద్‌ ఇబ్రహీం నిధులు సమకూరుస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలో ఘాటుగా స్పందించారు. 

హీరో సిద్ధార్థ్ సామాజిక అంశాలపై, దేశంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలు, మత విద్వేషాలపై స్పందిస్తూ తన గళం విప్పుతున్నారు. ఇటీవల కొందరు బీజేపీ కార్యకర్తలు తనని అత్యాచారం చేసి, హత్య చేస్తామని బెదిరించాని, వరుసగా ఐదువందల కాల్స్ వచ్చాయని సంచలన కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ బీజేపీ కార్యదర్శికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. సిద్ధార్థ్‌ సినిమాలకు దావూద్‌ ఇబ్రహీం నిధులు సమకూరుస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలో ఘాటుగా స్పందించారు. 

`సిద్ధార్థ్ నటించే సినిమాలకు దావూద్‌ ఇబ్రహీం నుంచి నిధులు వస్తున్నాయా? సమాధానం చెప్పండి` అని ట్వీట్‌ చేశాడు ఏపీ బీజేపీ కార్యదర్శి ఎస్‌ విష్ణు వర్థన్‌రెడ్డి. ఇందులో సిద్ధార్థ్‌ పేరుని ట్యాగ్‌ చేశాడు. దీనికి సిద్ధార్థ్‌ స్పందిస్తూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. `నో రా.. ఆయన నా ట్యాక్స్ కూడా పే చేసేందుకు సిద్ధంగా లేదు. నేను కరెక్ట్ గా ట్యాక్స్ పే చేస్తా కదరా విష్ణు. వెల్లి పడుకో. బీజేపీ స్టేట్‌ సెక్రెటరీ అంట. సిగ్గుండాలి` అంటూ తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు. దీనికి ఆయన అభిమానులు మద్దతు పలుకుతున్నారు. దీనిపై ఆ సదరు లీడర్‌ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

'బొమ్మరిల్లు` చిత్రంతో తెలుగు పాపులర్‌ అయిన సిద్ధార్థ్‌ ప్రస్తుతం తెలుగులో `మహాసముద్రం` చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో `టక్కర్`, `ఇండియన్‌ 2`, `నవరస` చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?