
`రౌడీయిజం చేయాలంటే జీపు, జీపులో పెట్రోల్.. దాంట్లో రౌడీలు కాదురా.. దమ్ము.. దమ్ముకావాలి` అని అంటున్నారు బర్నింగ్ స్టార్ సంపూర్నేష్‌బాబు. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం `బజార్ రౌడీ`. మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా, వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో కేఎస్ క్రియేషన్స్ పతాకంపై సందిరెడ్డి శ్రీనివాస్‌రావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ దీనికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని గురువారం విడుదల చేశారు. ఇందులో సంపూర్నేష్ బాబు తనదైన స్టయిల్‌లో మేనరిజం, పంచ్‌లు వేస్తూ అదరగొడుతున్నారు.
ఇందులో రౌడీయిజం గురించి సంపూర్నేష్‌బాబు చెప్పే డైలాగ్, అలాగే మీ కూతుళ్ల కోపరేషన్, మీ ఆపరేషన్ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. సీరియస్ కామెడీతోపాటు రొమాన్స్ కూడా ఇందులో పుష్పలంగా ఉన్నట్టు టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో షియాజీ షిండే, పృథ్వి, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి వంటి వారు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.