అవకాశాలు లేక.. తిండిలేక.. ఆటోలోనే కన్నుమూసిన నటుడు

Published : Mar 25, 2021, 04:43 PM IST
అవకాశాలు లేక.. తిండిలేక.. ఆటోలోనే కన్నుమూసిన నటుడు

సారాంశం

 తాజాగా తమిళనాడులో ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ విషాదం నెలకొంది. ఓ తమిళ నటుడు అవకాశాలు లేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆటోలోనే కన్నుమూశాడు. ఈ ఘటన అందరిని కలచివేస్తుంది.

సినిమా అనేది ఓ మాయా ప్రపంచం. ఇక్కడ ఒక్కసారి బ్రేక్‌ వస్తే వద్దన్నా అవకాశాలు వస్తాయి. కానీ గుర్తింపు వచ్చేంత వరకు స్ట్రగుల్‌ మాత్రం తప్పదు. ఎంతోమంది సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమకి వస్తారు. అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటారు. తిరిగి ఇంటికెళ్ల లేక, ఇక్కడే జీవనం సాగించలేక నానా తంటాలు పడుతుంటారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ విషాదం నెలకొంది. ఓ తమిళ నటుడు అవకాశాలు లేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆటోలోనే కన్నుమూశాడు. 

ఇంతటి విషాదకర, హృదయ విదారక ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. విరుత్చాగాకాంత్‌ బాబు అనే వ్యక్తి తమిళంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. `ప్రేమిస్తే`లో ఓ చిన్న పాత్ర కూడా పోషించాడు. ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి తోడు అతని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. దీంతో ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయిన విరుత్చాగా కాంత్‌ బాబు కొద్ది రోజులుగా చెన్సైలోనే ఉంటున్నాడు. డబ్బుల్లేక రూమ్‌ కిరాయి కూడా కట్టలేని పరిస్థితి. దీంతో రోడ్డుపైనే, బస్టాండ్లలో ఉంటూ నివసిస్తున్నాడు. కనీసం తిండి కూడా దొరక్క చివరకు ఆటోలో నిద్రిస్తూ తనువు చాలించాడు. ప్రస్తుతం ఈ ఘటన యావత్‌ ప్రజానికాన్ని కలచివేస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jana Nayagan Leak: నలుగురికే తెలిసిన రహస్యం, అయినా లీక్.. 'జన నాయగన్' టీమ్‌లో పెద్ద గొడవ!
Suman: ఫ్యామిలీతో సహా అనుభవిస్తారు, చేతబడిపై హీరో సుమన్ కామెంట్స్.. నెంబర్ 1 కాలేకపోయింది అందుకేనా ?