సునీల్ శెట్టి అండతో మంచు విష్ణు కాస్తంత గట్టెక్కాడు

By Surya PrakashFirst Published Mar 25, 2021, 4:57 PM IST
Highlights

విష్ణు ఎన్నో ఆశ‌లు పెంచుకున్న‌ మోస‌గాళ్లు.. ఆయన్నే మోసం చేసారు. చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగని భారీ స్కామ్ అని ఊరించి, కాజ‌ల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ల‌ని తీసుకొచ్చి సినిమా చేసినా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాకు 50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకున్న విష్ణు.. ఇప్పుడు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయాడంటూ  ట్రేడ్ లో వినిపిస్తోంది. విష్ణుకు మార్కెట్ లేకపోవడంతో ఓపినింగ్స్ లేవు. అలాగే  సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ కనీసం పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో హిందీ వరకూ మాత్రం సునీల్ శెట్టి కాపాడాడని తెలుస్తోంది. అదెలా సాద్యం. చూద్దాం.

వివరాల్లోకి వెళితే... వరస డిజాస్టర్ సినిమాలతో నెట్టుకొస్తున్న మంచు విష్ణు..తన సొంత బ్యానర్ పై  నిర్మించిన చిత్రం మోసగాళ్లు. సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విష్ణు అక్క పాత్రలో నటించింది. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా భారీగా విడుదలైంది. అయితే ఈ సినిమాలో కంటెంట్ బాగా వీక్ గా ఉండటంతో  మోసగాళ్లు సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో కచ్చితంగా తన కెరీర్‌లో అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని అందుకుంటానని ధీమాగా చెప్పిన ఈయనకు మరోసారి నిరాశనే మిగిల్చింది ఈ చిత్రం. 

హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీను తీసుకొచ్చి భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన మోసగాళ్లు దారుణంగా డిజాస్టర్ ఫలితం ఇచ్చింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు మినిమం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా రాలేదు. తనకు మార్కెట్ లేదని తెలుసు.. అయినా కూడా కథపై నమ్మకంతో ముందుకెళ్తున్నానంటూ ప్రమోషన్స్‌లోనే చెప్పాడు మంచు విష్ణు. పైగా ఖర్చుకు వెనకాడకుండా తన సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా తీసుకొచ్చాడు. ప్రపంచాన్ని కుదిపేసిన బిగ్గెస్ట్ ఐటి స్కామ్ ఇందులో చూపించారు విష్ణు టీం. ఈ సినిమాకు కథ కూడా ఈయనే అందించాడు. భారీ హంగుల మధ్య మొన్న  విడుదలైన ఈ చిత్రం తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా అంతే దారుణంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు హిందీ రైట్స్ వరకూ సునీల్ శెట్టి కాపాడంటున్నారు. హిందీ యూట్యూబ్, శాటిలైట్,  థియోటర్ రైట్స్ కలిపి 10.2 కోట్లు దాకా వచ్చాయని చెప్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన అతి పెద్ద మొత్తంగా చెప్తున్నారు. 
 
 అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా ‘మోసగాళ్ళు’ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. అయితే ఇలాంటి క‌థ‌ను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై  ఎలా థ్రిల్లింగ్‌ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడ్డాడు. రైటింగ్ కూడా చాలా వీక్ గా ఉండటం బాగా మైనస్ గా మారింది. 

click me!