తొలిసారి మీడియా ముందుకు సంపూ.. బిగ్ బాస్ లో ఇదీ జరిగింది

Published : Sep 05, 2017, 08:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
తొలిసారి మీడియా ముందుకు సంపూ.. బిగ్ బాస్ లో ఇదీ జరిగింది

సారాంశం

బిగ్ బాస్ షోలో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రెండు వారాలు కూడా గడవక ముందే  అక్కడి పరిస్థితులను త‌ట్టుకోలేక బ‌య‌ట‌కి వ‌చ్చాడు  ఆ షో నుండి బయటకు వచ్చిన తర్వాత సంపూ పై విమ‌ర్శ‌లు పుకార్లు వ‌చ్చాయి తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చి బిగ్ బాస్ లో జరిగింది చెప్పాడు

 

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకోవడం, రెండు వారాలు కూడా గడవక ముందు అక్కడి పరిస్థితులను తట్టుకోలేక బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సంపూ బయటకు వచ్చాక రకరకాల ప్రచారం జరిగింది. ఆ షో నుండి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన విమర్శలు, పుకార్లపై సంపూ సోషల్ మీడియా ద్వారా మాత్రమే స్పందించారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. తాను బయటకు రావడానికి గల కారణాలు వెల్ల‌డించాడు.

నేను చాలా ఫ్రీ గా తిరిగే మనిషిని. బిగ్ బాస్  ఇంట్లో నాలుగు గొడల మధ్య ఉండలేక పోయాను. ఇంట్లో నాకేంటో శ్వాస ఆడనట్టుగా, ఏదో అయిపోతున్నట్టు అనిపించడంతో టెన్షన్ కు గురయ్యా. అక్కడి పరిస్థితులను తట్టుకోలేకే బయటకు వచ్చాను అని సంపూర్ణేష్ బాబు తెలిపారు. బిగ్ బాస్'లో ఆఫర్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే, తారక్ అన్న హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 సినీ పరిశ్రమలో చాలామందిని కలిశాను. కానీ, తారక్ అన్నను కలవలేదు. ఈ షోకు వారానికొకసారి ఆయన వస్తాడు కాబట్టి, మాట్లాడొచ్చు అని అనుకున్నాను.అని సంపూ తెలిపారు.ఈ షో ద్వారా నేను ఇంకా పాపులర్ అయి, ప్రతిఒక్కరికీ తెలుస్తాననేది కూడా ఒక కారణం. షో గురించి వారు చెప్పిన విషయాలు నచ్చి వెంటనే ఒప్పుకున్నాను అని, కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఉండలేక పోయాను అని అర్థమైందని. సంపూ తెలిపారు.

బిగ్ బాస్ ఆఫర్ గురించి హృదయ కాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ కు చెప్పాను. బిగ్ బాస్ లో  నటిస్తే చాలా షరతులు ఉంటాయి. ఫోన్లు ఉండవు, పెన్నూ పేపర్ కూడా ఇవ్వరు. నువ్వేమో, నాలుగైదు రోజుల షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళుతుంటావు. మరి, ‘బిగ్ బాస్'లో అన్ని రోజులు ఉండగలుగుతావా  అని ఆయన ముందే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అపుడు బిగ్ షో అనే ఆనందంలో ఒప్పుకున్నాను అని సంపూ తెలిపారు.

బిగ్ బాస్ షోలో మొదటి రోజు తారక్ అన్నను కలిసిన తర్వాత ‘బిగ్ బాస్'షోను జయించినంత ఆనందం కలిగింది. ఆ రోజు తారక్ అన్నను కలిసి, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టగానే నాకు టెన్షన్ మొదలైంది అని సంపూ తెలిపారు. బిగ్ బాస్ ఇంట్లో రోజులు గడిచే కొద్దీ నాకేదో అవుతోంది.

 నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ గుర్తొచ్చి  వాళ్లకు ఏదో అయిపోతున్నట్లు అనిపించింది. అక్కడ ఉండటం నా వల్ల కాలేదు. మెంటల్ గా కాస్ట డిస్ట్రబ్ అయినట్లు అనిపించింది అని సంపూ తెలిపారు


 

PREV
click me!

Recommended Stories

Dhurandhar: 1000 కోట్ల క్లబ్ లో ధురంధర్..ఈ ఫీట్ సాధించిన 9 సినిమాలు ఇవే, 4 టాలీవుడ్ నుంచే
Jabardasth : ఈగో వల్ల జబర్దస్త్‌ ను వదిలి వెళ్లిపోయిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?