స్పైడర్  సెకండ్ సాంగ్ పుచ్చకాయ పుచ్చకాయ రిలీజ్

Published : Sep 05, 2017, 08:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
స్పైడర్  సెకండ్ సాంగ్ పుచ్చకాయ పుచ్చకాయ రిలీజ్

సారాంశం

మహేష్ బాబు హీరోగా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తోన్న మూవీ స్పైడ‌ర్ ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఎస్.జె.సూర్య నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. స్పైడ‌ర్ సినిమా నుంచి మరో సాంగ్ హాలి హాలి అనే సాంగ్ రిలీజైంది


 మహేష్ బాబు హీరోగా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తోన్న స్పైడ‌ర్ సినిమా నుంచి మరో సాంగ్ 'హాలి హాలి' రిలీజైంది. 'పుచ్చకాయ పుచ్చకాయ' అంటూ లిరిక్స్‌తో ఈ పాట అభిమానులను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్పైడ‌ర్ లో మహేష్ బాబు స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది.

 

హాలి హాలి పాట విడుదలైంది. ఎంజాయ్' అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. విభిన్న క‌థాంశంతో మురుగ‌దాస్ రూపొందిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.హాలీ హాలీ పాటను బ్రిజేష్ త్రిపాటి సాండిల్య, హరిణి, సునిత కలిసి పాడారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. రాజమజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. పుచ్చకాయ పుచ్చకాయ అంటూ లిరిక్స్ తో సాగు ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా ఎస్.జె.సూర్య నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు.


మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌ మొదటి సారి కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?