నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని నెంబర్ సిరీస్!

Published : Aug 29, 2018, 02:46 PM ISTUpdated : Sep 09, 2018, 01:08 PM IST
నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని నెంబర్ సిరీస్!

సారాంశం

సినీ నటులు నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

సినీ నటులు నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో హరికృష్ణ కుమారుడు జానకి రామ్ కూడా ఇదే తరహాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

అప్పుడు జానకిరామ్ ప్రయాణించిన కారు నెంబర్ ఏపీ29 బీడీ 2323 కాగా, ఇప్పుడు ప్రమాదానికి గురైన హరికృష్ణ కారు నెంబర్ ఏపీ28 బీడబ్ల్యూ 2323 కావడం గమనించాల్సిన విషయం. ఈ 2323 సిరీస్ తో ఉన్న వాహనాలు యాక్సిడెంట్లకు గురి కావడంతో ఈ నెంబర్ నందమూరి కుటుంబానికి కలిసి రావడం లేదని అభిమానులు అంటున్నారు.

కొడుకు ఇష్టపడి రిజిస్టర్ చేయించిన నంబర్ కావడంతో హరికృష్ణ కూడా ఇదే సిరీస్ లో తన కారుని రిజిస్టర్ చేయించారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. తండ్రీకొడుకులిద్దరూ కూడా నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.  

ఇవి కూడా చదవండి.. 

హరికృష్ణ మోసపోయారు.. పోసాని సంచలన కామెంట్స్!

హరికృష్ణ మృతి... సమంతపై నెటిజన్ల ఫైర్

నాన్న మమ్మల్ని అలా పెంచలేదు.. తండ్రి గొప్పదనాన్ని వివరించిన ఎన్టీఆర్!

PREV
click me!

Recommended Stories

చెమటలు పట్టించే హారర్ థ్రిల్లర్, ఉత్కంఠ రేపే సస్పెన్స్, ఫస్ట్ లుక్ తోనే భయపెట్టిస్తున్న సినిమా..
ప్రభాస్ పెళ్లి రోజే నా పెళ్లి .. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్, బ్యాచిలర్ గురు గా మారిపోయిన రెబల్ స్టార్..