
అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత.. దగ్గుబాటి రానా కటౌట్‌ను ట్వీట్ చేసింది. ‘అడిగో నా సూపర్‌స్టార్ అన్నయ్య’ అంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన రానా భారీ కటౌట్ ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. నేనే రాజు నేనే మంత్రి, ఫస్ట్‌డే ఫస్ట్ షో, ఆగస్టు 11 అని ఆ పోస్ట్‌కు హ్యాష్‌ట్యాగ్స్‌ను జతచేసింది. రానా, చైతూలిద్దరూ బావ బామ్మర్దులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్లిద్దరికీ మాంచి బంధం వుంది. ఇక అక్కినేని ఇంట కుడి కాలు పెట్టబోతున్న సమంత రానాను చాలా ఆప్యాయంగా చూసుకుంటుంది. అన్నకు సపోర్ట్ గా నేనే రాజు ప్రమోషన్ లో తన వంతు ట్వీట్ పోషించింది సామ్.
రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ నెల 11న విడుదల కానుంది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనువిందు చేయనుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన రానా భారీ కటౌట్ సమంతను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆమె దాన్ని ట్విట్టర్‌లో తన అభిమానులతో పంచుకుంది.