సమంత ఫ్యాన్స్ కి కిక్కిచ్చే బజ్.. 'దూకుడు' కాంబో రిపీట్, రాజమౌళి అప్రోచ్ అయ్యారా ?

pratap reddy   | Asianet News
Published : Nov 13, 2021, 04:47 PM IST
సమంత ఫ్యాన్స్ కి కిక్కిచ్చే బజ్.. 'దూకుడు' కాంబో రిపీట్, రాజమౌళి అప్రోచ్ అయ్యారా ?

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి కాగా.. రాజమౌళి ఈ చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి కాగా.. రాజమౌళి ఈ చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. 

ఇక RRR తర్వాత రాజమౌళి తెరకెక్కించేబోయే మూవీ గురించి కూడా చాలా రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. తన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ Mahesh Babuతో అని రాజమౌళి ఇదివరకే స్వయంగా ప్రకటించాడు. అయితే మహేష్ బోడి లాంగ్వేజ్ కు తగ్గట్లుగా, పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఉండే కథ కోసం రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. 

ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత జక్కన్న పూర్తిగా మహేష్ సినిమా కోసం సమయం కేటాయించనున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ కు హీరోయిన్ గా సమంత పేరు వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది. రాజమౌళి, మహేష్, సమంత క్రేజీ కాంబో గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు మొదలయ్యాయి. 

రాజమౌళి ఈగ చిత్రంలో Samantha నటించింది. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో సామ్ నటించబోతోంది అని, ఇది వరకే జక్కన్న సమంతని అప్రోచ్ అయ్యారని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

Also Read: అమేజింగ్ పిక్స్.. చీరకట్టులో చెమటలు పట్టిస్తున్న జెనీలియా

మహేష్, సమంతలది సూపర్ హిట్ కాంబినేషన్. దూకుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ కాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంతకు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ వచ్చింది. మహేష్, రాజమౌళి కాంబోలో సమంత ఫిమేల్ లీడ్ గా నటించడం ఖాయం అని అంటున్నారు. బహుశా అందుకేనేమో ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సామ్ ముందుగా రియాక్ట్ అవుతోంది. రీసెంట్ గా 'నాటునాటు' సాంగ్ రిలీజ్ కాగా 'మెంటల్' అంటూ సమంత రియాక్ట్ అయింది. 

చైతో బ్రేకప్ తర్వాత సమంత ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. సమంత కూడా అదే తరహాలో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతోంది. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం శాకుంతలంలో నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?