'Chhatriwali' First Look: కండోమ్ ఓపెన్ చేసిన రకుల్.. డబుల్ మీనింగ్ డైలాగులు

pratap reddy   | Asianet News
Published : Nov 13, 2021, 02:16 PM IST
'Chhatriwali' First Look: కండోమ్ ఓపెన్ చేసిన రకుల్.. డబుల్ మీనింగ్ డైలాగులు

సారాంశం

క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో తన గ్లామర్ తో అదరగొట్టింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది రకుల్.

క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో తన గ్లామర్ తో అదరగొట్టింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది రకుల్. మరికొన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా రకుల్ బాలీవుడ్ లో ఓ క్రేజీ మూవీలో నటిస్తోంది. 

తేజాస్ దర్శకత్వంలో, రోనీ స్క్రూవాలా నిర్మాణంలో నటించబోతున్నట్లు Rakul Preet Singh గతంలోనే ప్రకటించింది. తాజాగా ఆ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'ఛత్రివాలి'(Chhatriwali) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఓ కండోమ్ ప్యాకెట్ ని ఓపెన్ చేస్తూ కనిపిస్తోంది. 

తన సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రకుల్.. డబుల్ మీనింగ్ డైలాగులతో కామెంట్స్ పెట్టింది. 'ఎప్పుడైనా వర్షం రావచ్చు.. మీ గొడుగులు సిద్ధంగా ఉంచుకోండి' అంటూ హాట్ కామెంట్స్ చేసింది. 

Also Read: అల్లు అర్జున్ యూటర్న్.. నానికి షాక్ అంటూ ఊహాగానాలు

ఈ చిత్రం లేడి ఓరియెంటెడ్ మూవీగా ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్ పాత్రలో నటిస్తోంది. కండోమ్ టెస్టర్ అంటే.. కండోమ్ నాణ్యతని అనుభవపూర్వకంగా శృంగారంలో పాల్గొని తెలుసుకునితెలుసుకోవాలి. కండోమ్ తయారు చేసిన కంపెనీకి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. దీనితో కండోమ్ టెస్టర్లు కంపెనీ నుంచి వేతనం పొందుతారు. రకుల్ పోషిస్తున్న ఈ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇక కథ పరంగా శృంగార సన్నివేశాలు ఉంటాయి. 

దర్శకుడు తేజాస్ ఈ చిత్రాన్ని అడల్ట్ కామెడీ జోనర్ లో తెరకెక్కించబోతున్నారు. శృంగారం అనే సున్నితమైన అంశం గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ గతంలో రకుల్ ఈ చిత్రం గురించి కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండగా రకుల్ చివరగా తెలుగులో వైష్ణవ్ తేజ్ సరసన 'కొండపొలం' అనే చిత్రంలో నటించింది. మొత్తంగా రకుల్ కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు తెరతీసింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
Illu Illalu Pillalu Today Episode Dec 15: తాగేసి రచ్చ రచ్చ చేసిన వల్లీ, ఇచ్చిపడేసిన ప్రేమ