Radheshyam Update: ప్రభాస్‌ అభిమాని బెదిరింపులకు తలొగ్గిన `రాధేశ్యామ్‌` యూనిట్‌..

Published : Nov 13, 2021, 04:14 PM IST
Radheshyam Update: ప్రభాస్‌ అభిమాని బెదిరింపులకు తలొగ్గిన `రాధేశ్యామ్‌` యూనిట్‌..

సారాంశం

`Radheshyam` సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారనే విషయాన్ని తెలియజేశాడు. ఈ నేపథ్యంలో ఏట్టకేలకు `రాధేశ్యామ్‌` యూనిట్‌ స్పందించింది. ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. 

ఎట్టకేలకు ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న `రాధేశ్యామ్‌`(Radheshyam Movie) చిత్ర యూనిట్‌ స్పందించింది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది. ఇన్నిరోజులు ఎలాంటి అప్డేట్‌ లేకుండా అభిమానులు వెయిట్‌ చేస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం స్పందించింది. నిన్న(శుక్రవారం) ఓ అభిమాని ఏకంగా Radheshyam సినిమాకి సంబంధించి అప్‌డేట్‌ ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఓ లెటర్‌ కూడా రాస్తూ బెదిరింపులకు దిగాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి యూవీ క్రియేషన్స్, దర్శకుడు రాధాకృష్ణ లే కారణమని తెలిపాడు. ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారనే విషయాన్ని తెలియజేశాడు. ఈ నేపథ్యంలో ఏట్టకేలకు `రాధేశ్యామ్‌` యూనిట్‌ స్పందించింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. 

ఈ నెల 15న సాయంత్రం ఐదు గంటలకు సినిమా నుంచి `ఈ రాతలే.. `అంటూ సాగే పాటని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు రోజుల్లో పాట రాబోతున్న నేపథ్యంలో మరింత ఈగర్‌గా ఆ పాట కోసం వెయిట్‌చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వర్షెన్‌కి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. హిందీ వర్జెన్‌ మిథూన్‌, అమల్‌ మాలిక్‌, మనన్ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. మొదటగా ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్‌ రాబోతుందని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే పీరియాడికల్‌ లవ్‌ రొమాంటిక్‌ డ్రామాగా సినిమా రూపొందుతుంది. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ Prabhas సరసన పూజా హెగ్డే (Pooja Hegde)కథానాయికగా నటిస్తుంది. `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. అది సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్యగా నటిస్తున్నాడు. ఆయన మనిషి కాదని, అలాగని దేవుడిని కూడా కాదని ఇటీవల రిలీజ్‌ అయినా ఫస్ట్ గ్లింప్స్ లో తెలిపారు. ఆయన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుండటం విశేషం. 

also read: ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్... 'నా చావుకు రాధే శ్యామ్ డైరెక్టర్ కారణం'

యు వీ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాని నిర్మిస్తున్నారు. హిందీలో టీ సిరీస్‌ నిర్మాణంలో భాగమైంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాపై అందరినిలోనూ భారీ అంచనాలున్నాయి. చాలా రోజుల తర్వాత కృష్ణంరాజు ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ చిత్ర కథని స్వయంగా కృష్ణంరాజు.. దర్శకుడు రాధాకృష్ణతో ప్రత్యేకంగా రాయించి నిర్మించడం విశేషం. 

also read: Prabhas: ఆదిపురుష్ షూటింగ్ అప్డేట్... గుమ్మడికాయ కొట్టిన ప్రభాస్!
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు