Thaman S : గని ‘రోమియో జూలియట్’సాంగ్ లాంచ్.. ఏడేండ్ల కిందనే ఈ సాంగ్ ను తన లవర్ కోసం కంపోజ్ చేశాడంటా థమన్ .!

Published : Feb 08, 2022, 06:37 PM IST
Thaman S : గని ‘రోమియో జూలియట్’సాంగ్ లాంచ్.. ఏడేండ్ల కిందనే ఈ సాంగ్ ను తన లవర్ కోసం కంపోజ్ చేశాడంటా థమన్ .!

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’మూవీ నుంచి తాజాగా ‘రోమియో జూలియట్’ సాంగ్ లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ లో థమన్ మాట్లాడుతూ ఈసాంగ్ ను తన లవర్ కోసం కంపోస్ట్ చేసినట్టు  పేర్కొన్నాడు.      

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి ఈ ఏడాది రెండు క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 కాగా మరొకటి వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'గని'. ఈ రెండూ ఒకదానికొకటి పొంతనలేని చిత్రాలు. ఎఫ్3 కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్. ఇక 'గని' యాక్షన్ మూవీ. 

కాగా డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా ఫిబ్రవరి 25న లేదంటే మార్చి 4న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.  

అయితే ఇప్పటికే ఈ మూవీ  నుంచి రెండు సాంగ్స్ ను వదిలారు. గని అంథిమ్ సాంగ్, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘కొడితే’ స్పెషల్ సాంగ్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్యాచీ ట్యూన్ ఇవ్వడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విజయవాడలోని ఓ కాలేజీలో  థర్డ్ సింగల్ ‘రోమియో జూలియట్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా  మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ ‘ఈ సాంగ్ ఏండేండ్ల కిందనే కంపోజ్ చేశానని, ఒక అమ్మాయి కోసం’ కంపోజ్ చేసినట్టు తెలిపారు. 

మరోవైపు యూత్ ను ‘రోమియో జూలియెట్’ సాంగ్ బాగా ఆకట్టుకుంటోంది. థమన్ మ్యూజిక్ అందించగా, అదిథి శంకర్ గాత్రం అందించారు. రఘురామ్ యూత్ ను ఆకట్టుకునేలా లిరిక్స్ రాశారు. తదితరులు మిగితా ఇన్ స్ట్రూమెంట్స్ వాయించి సహకరించారు. 
 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం