ముసలి ముఖమన్నందుకు సమంత కౌంటర్.. చెవిలో వెంట్రుకలంటూ?

Published : Apr 22, 2023, 08:31 AM IST
ముసలి ముఖమన్నందుకు సమంత కౌంటర్..  చెవిలో వెంట్రుకలంటూ?

సారాంశం

 ఆయనకు చెవుల నుంచి వచ్చిన జుట్టు వ్యవహారాన్ని మెన్షన్ చేస్తూ ఆమె కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


రీసెంట్ గా రిలీజ్  అయిన 'శాకుంతలం' (Shakuntalam) సినిమా  బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దాంతో సరైన ఓపినింగ్స్ రాబట్టలేకపోయింది. దాంతో  మొదటి షో నుండి ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు కనీసం చూడటానికి ఆసక్తి చూపలేదు. ఇంత డిజాస్టర్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ వేదనలో ఉన్న  సమంతని మీడియాలో డైరక్ట్ ఎటాక్ చేసారు నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టి. 

ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ... సమంత ని చాలా తీవ్రంగా విమర్శించాడు. సమంతకి ముసలి ముఖం వచ్చేసిందని ఆమె శకుంతల? ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాదు జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా నాటకాలు ఆడుతోందని సింపతితో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అనుకుంటుందని అందుకే ఆమె ఎప్పటికప్పుడు తన అనారోగ్యం గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది అంటూ చిట్టి బాబు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు.

అలాగే  ఈ సినిమా రిజల్ట్  గురించి మాట్లాడుతూ ఇందులో సమంత శకుంతల పాత్రకు సరిపోదని మొదట చెప్పాను అని, తను చెప్పినట్టుగానే సినిమాలో ఆమె పాత్ర బాగోలేదని, అందుకే సినిమా ప్లాప్ అయిందని చెప్పాడు. ఈ విషయం వైరల్ గా మారింది. ఈ  నేపథ్యంలో ఈ విషయం సమంత వరకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయనకు  ఫెరఫెక్ట్ కౌంటర్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.  ఆయనకు చెవుల నుంచి వచ్చిన జుట్టు వ్యవహారాన్ని మెన్షన్ చేస్తూ ఆమె కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జనానికి చెవుల్లో నుంచి కూడా జుట్టు ఎందుకు బయటకు వస్తుందంటూ గూగుల్లో  సెర్చ్ చేస్తే డాక్టర్లు టెస్టిరోన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అలా జుట్టు బయటకు వస్తుందని భావిస్తున్నారని పేర్కొందని ఆ పోస్ట్ లో ఉంది. అంతేకాక ఈఫ్ యు నో యు నో అంటూ ఆమె కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది... చిట్టిబాబు గురించి ఆమె కామెంట్ చేస్తోందని, ఆయనకి టెస్టిరోన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధంగా  మాట్లాడుతున్నారని అర్థం వచ్చేలా ఆమె కామెంట్లు చేసిందని  అందరూ ఈ పోస్ట్ తో  అంటున్నారు. అయితే ఇందకు సంభందించిన ఇనిస్ట్రా పోస్ట్ మాత్రం కనపడటం లేదు. డిలేట్ చేసి ఉండవచ్చు అని తెలుస్తోంది. 

ప్రస్తుతం సమంత 'ఖుషి' (Khushi) అనే సినిమా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో చేస్తోంది. ఇంకా 'సిటాడెల్' (Citadel) అనే వెబ్ సిరీస్ కూడా వుంది.   సమంత ఇప్పుడు లండన్ లో వుంది. ఆమె, దర్శకులు రాజ్ డీకే (Raj&DK) లతో లండన్ (London) లో వున్న ఫోటో  వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదీ కాకుండా ఇప్పుడు ప్రియాంక చోప్రా  నటించిన ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) ప్రీమియర్ కి తయారయి వెళుతూ తన ఫోటోస్ పోస్ట్ చేసింది. ఇందులో సమంత  హెల్దీగా చాలా బాగుంది. మొన్నటివరకు ఆ కళ్లద్దాలు పెట్టుకొని, 'శాకుంతలం' సినిమాకి ప్రచారాలు నిర్వహించిన సమంత, ఇక్కడ ప్రీమియర్ కి హాజరు అయిన సమంతని చూస్తే ఏం అని కొందరు మాట్లాడటం మొదలెట్టారు.

PREV
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి