మెగా వారసుడి రాకకోసం చిరంజీవి ఫ్యామిలీతో పాటు..మెగా ఫ్యాన్స్ కూడా ఈతర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఉపాసన డెలివరీఅవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో తన డెలివరీ డేట్ గురించి ఉపాసన క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా వారసుడి కోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూనియర్ రామ్ చరణ్ బయటకు వస్తాడా..? అని ఇటుఫ్యామిలీ అటుఫ్యాన్స్ ఈగర్ గావెయిట్ చేస్తున్నారు. తాము కూడా తమ బిడ్డ కోసం ఎంతో ఆత్రుతతో చూస్తున్నట్టు రామ్ చరణ్ సతీమణి ఉపాసన అన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట ముచ్చటగా మూడోసారి ఉపాసనకు సీమంతం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని .. తమ వారసుడికి వెల్ కమ్ చెప్పారు.
ఇంతకు ముందు ఫ్రెండ్స్ అంతా ఉపాసనకు సీమంతం జరపగా.. రీసెంట్ గా దుబయ్ లో ఉపాసన సిస్టర్స్ ఈ వేడుకను జరిపారు. తాజాగా.. తమ ఇంటి కోడలికి మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గాసీమంతం వేడుకలు జరిపారు. ఇక ఈక్రమంలో ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి అలాగే తన డెలివరీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు జులై నెలలో డెలివరీ డేట్ ఇచ్చారని అప్పుడే బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలిపారు.తాజాగా చిరు ఇంట్లో ఉపాసనకు జరిగిన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశారు.
తాను, చరణ్ .. తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని ఉపాసన తెలిపారు. కొంత కాలం చాలా బిజీగా గడిపిన చరణ్ ఇక తన టైమ్ ను ఎక్కువగా తనకే కేటాయించారన్నారు ఉపాసన. రామ్ చరణ్ పుట్టబోయే బిడ్డ కోసం కొద్ది రోజులు షూటింగ్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. దాదాపు మూడు నెలలు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డెలివరీ తరువాత పుట్టబోయే బిడ్డతో టైమ్ స్పెండ్ చేసి.. ఆతరువాత ఫ్రెష్ గా సెట్ లో అడుగు పెట్టాలని చూస్తున్నారట రామ్ చరణ్. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిక్షణం రామ్ చరణ్ తనకు చాలా సపోర్ట్ చేస్తున్నాడని అన్నారు ఉపాసన.
ఏ భార్య అయిన తన డెలివరీ టైమ్ లో ఎవరు పక్కన ఉన్నా.. లేకున్నా భర్త ఉండాలని కోరుకుంటారు. దాంతో ఉపాసన కోసం, పుట్టబోయే బిడ్డకోసం రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే ఇంత ప్రేమ చూసిపిస్తున్న చెర్రీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబర్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. ఈసినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో.. రామ్ చరణ్ పేరు హాలీవుడ్ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. దాంతో త్వరలోనే చెర్రీ హాలీవుడ్ ఎంట్రీ ఖాయం అంటూ హింట్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈసినియా రెండు షెడ్యూల్స్ వరకూ పెండింగ్ ఉన్నాయి. అయితే ఈవి కంప్లీట్ చేసేలోపు.. వారసుడు పుట్టబోతున్నాడు. అయితే ఈ షెడ్యూల్ కూడా పెండింగ్ లో పెట్టి.. హ్యాపీగా భార్యతో సమయంఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట రామ్ చరణ్.