
ప్రముఖ సోషల్ ప్లాట్‌ఫార్మ్ ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉండాలంటే.. యూజర్స్ దానిని సబ్‌స్క్రిప్షన్ ద్వారా కొనుగోలు చేయాలంటూ.. ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఈ సబ్‌స్ర్కిప్షన్ కోసం ఏప్రిల్ 20 వరకు గడువుని ఇచ్చాడు. సబ్‌స్ర్కిప్షన్ ఛార్జ్ లు చెల్లించిన వారి అకౌంట్లకు మాత్రమే బ్లూ టిక్ ఉంటుందని.. లేనివారు వాటిని కోల్పోతారని మస్క్ స్పష్టంగా చెప్పాడు. ఇక అనుకున్నట్టుగానే రీసెంట్ గా చాలా మందిసెలబ్రిటీలు తమ ట్విట్టర్ ఖాతా నుంచి బ్లూ టిక్ ను కోల్పోయారు. అమితాబ్ నుంచి చిరంజీవి వరకూ.. జగన్ , చంద్రబాబు తో పాటు.. స్టార్ క్రికెటర్లు.. ఇతర రంగాల సెలబ్రిటీలు చాలా మంది తమ ఖాతా నుంచి బ్లూ టిక్ కోల్పోయారు.
అయితే ఈ బ్లూ టిక్ తొలిగింపు పై చాలా మంతి తారలు స్పందిస్తున్నారు. కొంత మంది మాత్రం వెటకారంగా.. ఫన్నీ ఫన్నీ ట్వీట్లు పెడుతున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ద్వారా.. హే ట్విట్టర్ బ్రదర్ వింటున్నావా? నేను సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బు చెల్లించాను. కాబట్టి నా బ్లూ టిక్ ని తిరిగి ఇవ్వండి. దాని వల్ల నేనే అమితాబ్ బచ్చన్ ని అని ప్రజలు తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని చేతులు జోడించి మరీ అడుగుతున్నాను. లేకుంటే మీ కాళ్ల మీద కూడా పడమంటావా? అంటూ ట్వీట్ చేశాడు.
అటు టాలీవుడ్ హీరోయిన్లు మెహ్రీన్ పిర్జాదా , నిధి అగర్వాల్ కూడా తమ బ్లూ టిక్స్ కోల్పోవడం పై స్పందించారు. ట్వీట్స్ చేశారు. నా బ్లూ టిక్ ఎక్కడో పోయింది అంటూ నిధి అగర్వాల్ ట్వీట్ చేస్తే, బాయ్ బాయ్ బ్లూ టిక్ అని మెహ్రీన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా టాలీవుడ్ నుంచి చాలా మంది తారలు తమ ట్విట్టర్ బ్లూ టిక్ ను కోల్పోయారు. మెగాస్టార్ చిరంజీవి , వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తమ బ్లూ టిక్ ను కోల్పోగా.. ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున బ్లూ టిక్ ఇంకా అలానే ఉంది.
మరో వైపు పేరు మార్పు జరగడంతో త్రిష, జయం రవి తమ బ్లూ టిక్స్ ను కోల్పోయారు. పొన్నియిన్ సెల్వన్ మూవీ ప్రమోషన లో భాగంగా.. త్రిష, హీరో జయం రవి తమ పేర్లు.. సినిమాలో క్యరెక్టర్ నేమ్స్ తో ట్విట్టర్ ప్రొఫైల్స్ మార్చారు. దాంతో బ్లూ టిక్ తొలగిపోయింది. తిరిగి ఒరిజినల్ పేర్లు పెట్టినాకూడా బ్లూ టిక్ రాలేదు. జయం రవి మాత్రం తనపాత్ర పేరు కంటీన్యూ చేస్తుండగా.. త్రిష తన పేరును మార్చేసింది.