మహేష్ అక్కకి సమంత థాంక్స్.. ఎందుకంటే..?

Published : Feb 26, 2019, 03:42 PM IST
మహేష్ అక్కకి సమంత థాంక్స్.. ఎందుకంటే..?

సారాంశం

ఏమాయ చేసావె' చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది సమంత. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది సమంత. 

'ఏమాయ చేసావె' చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది సమంత. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది సమంత.

తన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపించిన 'ఏ మాయ చేసావె' సినిమా విడుదలై తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా సమంత పాత రోజులని గుర్తు చేసుకున్నారు. 

ఈ చిత్ర నిర్మాత మంజుల ఘట్టమనేని మంగళవారం నాడు ఓ ట్వీట్ చేశారు. 'తొమ్మిదేళ్లు అవుతోంది. అయినా.. అంతా నిన్నే జరిగినట్లుంది. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ ధన్యవాదాలు' అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఇది చూసిన సమంత.. 'నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు థాంక్స్' అంటూ లవ్ సింబల్స్ పెట్టింది. అలానే తన అభిమానులను ఉద్దేశిస్తూ 'మీరు లేకపోతే నటిగా నాకు ఈ స్థానమే లేదు' అంటూ ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?